HomeMovie News Teluguసంజన ఆ 'టార్చర్‌' ఎలా భరించిందంటే!

సంజన ఆ ‘టార్చర్‌’ ఎలా భరించిందంటే!

‘బుజ్జిగాడు’ ఫేం సంజన లేటెస్టుగా ‘దండుపాళ్యం 2’ సినిమాలో నటించింది. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. గ్లామరస్‌ పాత్రల్లో నటించిన సంజన ఈ సినిమాలో డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించి, మెప్పించింది. అత్యంత క్రూరమైన క్యారెక్టర్‌లో సంజన నటించింది ఈ సినిమాలో. ఓ సీన్‌ కోసం ఆమెని చేతులు పైకి కట్టేసి అత్యంత ఘోరంగా పోలీసులు టార్చర్‌ పెట్టేస్తారు. ఆ సీన్‌ షూటింగ్‌ జరుగుతున్నప్పుడే ఆ టార్చర్‌ని భరించలేకపోయిందట సంజన.

‘దండుపాళ్యం-2’ సినిమా కోసం ఆ రకంగా సంజన చాలా కష్టపడ్డానంటోంది. చేతుల్ని నిజంగానే పైకి కట్టేశారట. చాలా ఇబ్బంది పడిందట. అయినా సినిమా కోసం ఆ టార్చర్‌ని భరించానంటోంది. ఆ రోజు రాత్రంతా మానసికంగా చాలా కుంగిపోయానని చెప్పింది. రియల్‌ లైఫ్‌లో టార్చర్‌ ఇంత దారుణంగా ఉంటుందా? అని ఆమెకు భయమేసిందట. తెరపై ఆ సీన్‌కి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో ఆ కష్టమంతా మర్చిపోయానని చెబుతోంది సంజన.

షూటింగ్‌ స్పాట్‌ నుంచి సెల్ఫీల్ని చెల్లెలు నిక్కీ గల్రానీకి పంపిస్తే, వారు కూడా ఆందోళన చెందారట ఆమె గెటప్‌ చూసి. సెట్స్‌లో ఉన్నప్పుడు బాగానే ఉన్నా, వాటిని ఆ తర్వాత చూసుకుంటే తనకే గగుర్పాటు కలిగిందని సంజన అంటోంది. మొత్తానికి పడిన కష్టం వృధా పోకుండా సినిమా మంచి విజయం సాధించినందుకు ప్రేక్షకులకు మనసారా థ్యాంక్స్‌ చెబుతోంది ముద్దుగుమ్మ సంజన. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular