HomeMovie News Teluguహాట్‌ అండ్‌ కూల్‌ - దటీజ్‌ సమంత

హాట్‌ అండ్‌ కూల్‌ – దటీజ్‌ సమంత

చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సమంత, జెఎఫ్‌డబ్ల్యు (జస్ట్‌ ఫర్‌ విమెన్‌) మ్యాగజైన్‌ కోసం చేనేత వస్త్రాలతో నే ేఫోటో షూట్‌కి దిగింది. ఆ ఫోటో షూట్‌ మామూలుగా ఉందా.. హాట్‌ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది ముద్దగుమ్మ సమంత. ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇంతకు ముందెన్నడూ లేనంత హాట్‌గా సమంత కనిపించే సరికి అంతా షాక్‌ అయ్యారు ఈ ఫోటోలు చూసి. ఆ షాక్‌ నుంచి తేరుకోవడానికి సమంత ఓ కూల్‌ ఫొటోని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఓ తమిళ సినిమా కోసం ట్రెడిషనల్‌ వేర్‌లో కనిపించింది ఈ ఫొటోలో.

అంతలోనే హాట్‌, అంతలోనే కూల్‌ – దటీజ్‌ సమంత. ఎంతైనా అక్కినేని వారి కోడలవుతోంది కదా, చాలా తెలివిగా వ్యవహరించింది సమంత ఇక్కడ. సమంత ఏం చేసినా హాట్‌ న్యూస్‌గానే ఉంటుంది. అలాంటిది, హాట్‌ లుక్‌లో కనిపిస్తే గుండె జారి గల్లంతయిపోదూ. అదే జరిగింది కుర్రకారుకి. అందుకే తన అభిమానుల్ని మళ్లీ తానే కూల్‌ చేసుకోవాలి కదా. వెంటనే కూల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చి, మరోసారి షాక్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్‌ చరణ్‌తో ‘రంగస్థలమ్‌ 1987’ చిత్రంలో నటిస్తోంది.

సుకుమార్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సమంత గ్లామర్‌కి అవకాశం లేని క్యారెక్టర్‌. అందుకేనేమో ఈ లోగా సోషల్‌ మీడియాలో ఇలా హాట్‌ పోజులతో కిర్రాకు పుట్టిస్తోంది. నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న ‘రాజుగారి గది’ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేస్తోంది. తమిళంలోనూ చేతి నిండా సినిమాలతో సమంత బిజీగానే ఉంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular