HomeMovie News Teluguనారా రోహిత్‌ పెద్ద షాకే ఇస్తాడట

నారా రోహిత్‌ పెద్ద షాకే ఇస్తాడట

నారా రోహిత్‌ ఎప్పుడూ బిజీనే. ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటాడు. అలా అని రెగ్యులర్‌ మూవీస్‌లో కూడా నటించడు నారా రోహిత్‌. నారా రోహిత్‌ టేకప్‌ చేసే సినిమాలన్నీ, డిఫరెంట్‌ స్టోరీలున్నవే. కొత్త డైరెక్టర్‌, పాత డైరెక్టర్‌ అనే తేడా లేకుండా, మల్టీస్టారర్‌, సోలో మూవీ అనే డిఫరెన్స్‌ లేకుండా, మంచి కథ దొరికితే నటించడానికి ముందుండే హీరో నారా రోహిత్‌. అలాగే సక్సెస్‌, ఫెయిల్యూర్‌తో అస్సలు సంబంధం ఉండదు మనోడికి. అందుకే నారా రోహిత్‌ టాలీవుడ్‌ హీరోస్‌లో స్పెషల్‌ హీరో. తాజాగా నారా రోహిత్‌ నటించిన ‘శమంతకమణి’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇందులో నారా రోహిత్‌తో పాటు, ఆది, సుధీర్‌బాబు, సందీప్‌ కిషన్‌ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. పోలీసాఫీసర్‌ పాత్రలో నారా రోహిత్‌ నటిస్తున్నాడు ఈ సినిమాలో. ఈ సినిమా తర్వాత నారా రోహిత్‌ మరో మల్టీ స్టారర్‌లో నటిస్తున్నాడు. అదే ‘వీర భోగ వసంతరాయలు’. ఈ మధ్య బాగా లావుగా ఉన్నాడంటూ కామెంట్స్‌ వస్తున్నాయి నారా రోహిత్‌పై. ఈ సినిమా కోసం ఫిట్‌గా తయారయ్యాడట. ఇదిలా ఉండగా, నారా రోహిత్‌ మరో సినిమా ‘కథలో రాజకుమారి’ కూడా చిత్రీకరణ చివరి దశకు చేరుకుందట. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెప్పక తప్పదంటున్నాడు.

కెరీర్‌లోనే ది బెస్ట్‌ పర్‌ఫామెన్స్‌ ఇచ్చాడట నారా రోహిత్‌ ఈ సినిమాలో. కొంచెం నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రట కానీ, చాలా చాలా బాగుంటుందంటున్నాడు. ఇంతవరకూ అలాంటి పాత్రలో నటించలేదట నారా రోహిత్‌. ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలో నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించాడు. ఆ తరహా పాత్రే అయినా కానీ ఇది వెరీ వెరీ స్పెషల్‌ అంటున్నాడు నారా రోహిత్‌. ఇదో డిఫరెంట్‌ లవ్‌స్టోరీ, అందర్నీ డిఫరెంట్‌గా మెస్మరైజ్‌ చేస్తుందంటున్నాడు మన నారా వారబ్బాయి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular