HomeMovie News Teluguసౌత్‌పై బాగా దృష్టి పెట్టిన కాజోల్‌

సౌత్‌పై బాగా దృష్టి పెట్టిన కాజోల్‌

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల తార కాజోల్‌. ఆమె నటనకి ఫిదా కాని వారు ఎవ్వరూ లేరంటే అతిశయోక్తి కాదు. నేచురల్‌ గ్లామర్‌తో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. పక్కింటి అమ్మాయిలా ఆమె పండించే హావభావాలకు బాలీవుడ్‌ మాత్రమే కాదు, కోలీవుడ్‌, టాలీవుడ్‌ కూడా అభిమానులే. అప్పుడెప్పుడో సౌత్‌లో ‘మెరుపుకళలు’ సినిమాతో ఆకట్టుకుంది కాజోల్‌. మళ్లీ ఇన్నాళ్లకి సౌత్‌లో మెరవబోతోంది. ధనుష్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘వీఐపీ – 2’ సినిమాలో కాజోల్‌ నటిస్తుందన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపిస్తోంది. ఇదే కాదు. ఇకపై సౌత్‌ సినిమాల్లో కంటిన్యూస్‌గా నటిస్తానని కాజోల్‌ స్వయంగా చెబుతోంది. సౌత్‌ ప్రేక్షకులు తననెంతగా అభిమానిస్తారో తనకి తెలుసనీ, అయితే సరైన అవకాశం కోసం ఎదురు చూశాననీ, ‘వీఐపీ – 2’తో ఆ అవకాశం రానే వచ్చింది. కాబట్టి ఇక వదులుకోననీ చెబుతోంది. హుందా అయిన పాత్రల్లో నటిస్తానని చెబుతోంది కాజల్‌.

కేవలం సినిమాల పరంగానే కాకుండా, వాణిజ్య పరంగానూ కాజోల్‌ ఇకపై సౌత్‌ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటానంటోంది. అందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్‌ పర్యాటక శాఖకు కాజోల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌ పర్యాటక ప్రదేశాలకు తగిన పబ్లిసిటీ అందించేందుకు కాజోల్‌ దేశ వ్యాప్త ప్రచారానికి సిద్ధం కానుందట. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular