HomeMovie News Teluguనో అబ్జక్షన్‌ అంటోన్న రాజశేఖర్‌

నో అబ్జక్షన్‌ అంటోన్న రాజశేఖర్‌

హీరో రాజశేఖర్‌ తనయ శివాని హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య శివాని హాట్‌ ఫోటో షూట్‌కి తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంకా చోప్రాకి డూప్‌లా ఉంది శివాని అంటూ ఆమె అందాన్ని తెగ పొగిడేశారు కూడా. రాజశేఖర్‌ హీరోగా ‘గరుడ వివేగ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌ నిమిత్తం రాజశేఖర్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన కుమారై తెరంగేట్రానికి సంబంధించిన ఆశక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇంతవరకూ సినిమాల్లో హీరోల కొడుకులు మాత్రమే హీరోలుగా వెలుగు వెలుగుతున్నారు. కానీ కూతుళ్లకు మాత్రం ఆ అవకాశం లేదు. అలా తెరంగేట్రం చేసిన వారిలో ఇంతవరకూ టాలీవుడ్‌లో మెగా హీరోయిన్‌ నిహారిక, మంచు హీరోయిన్‌ లక్ష్మీ ప్రసన్న మాత్రమే ఉన్నారు. అయితే ఈ జనరేషన్‌లో తన కూతురు శివాని కూడా హీరోయిన్‌గా వెలుగు వెలగాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నానని ఆయన అన్నారు. అంతేకాదు, సినీ రంగంలో హిపోక్రసీ ఎక్కువ అనే విషయంపై కూడా ఆయన స్పందించారు. తన కూతురు హీరోయిన్‌ అవుతానని అన్నప్పుడు ఆయన కూడా అందుకే కొంచెం ఆలోచించారట.

కానీ ఆమె ఇష్టానికి అడ్డు చెప్పకూడదనే, సినిమానే జీవితం కాదు, అదొక హాబీ మాత్రమేననీ, ముందు చదువు పూర్తి చేయమనీ, ఆ తర్వాతే సినిమా అని రాజశేఖర్‌ కూతురుతో చెప్పారట. ఒకవేళ తనకే కొడుకుంటే ఖచ్చితంగా హీరోని చేసేవాన్ని. లేడు కాబట్టి, నా కూతుళ్ల కోరికను ప్రోత్సహిస్తూ, హీరోయిన్స్‌గా చూడాలని అనుకుంటున్నాననీ అన్నారు. ఆయన చిన్న కూతురుకి కూడా నటనపై ఆశక్తి అని రాజశేఖర్‌ తెలిపారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular