HomeMovie News Teluguశ్రీశాంత్‌ కమిట్‌మెంట్‌ అదిరిపోవాల్సిందే!

శ్రీశాంత్‌ కమిట్‌మెంట్‌ అదిరిపోవాల్సిందే!

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లో కీలక పాత్ర పోషించిన క్రికెటర్‌ శ్రీశాంత్‌ హీరోగా తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. సురేష్‌ గోవింద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘టీమ్‌-5’ చిత్రంలో శ్రీశాంత్‌ హీరోగా నటిస్తున్నాడు. ముద్దుగుమ్మ నిక్కీ గల్రాని హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. శ్రీశాంత్‌ కుటుంబానికి సినీ రంగంతో అనుబంధం ఎక్కువ. తాను మాత్రమే క్రికెట్‌కి ప్రిపరెన్స్‌ ఇచ్చాడు. క్రికెట్‌ మైదానంలోనూ శ్రీశాంత్‌ డాన్సు స్టెప్పులతో అలరించేవాడు.

ఇప్పుడు సినిమా కోసం భీభత్సమైన డాన్సు స్టెప్పులతో ఇరగదీసేయనున్నాడట శ్రీశాంత్‌. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాల్లో హీరోగా తన సత్తా చాటాలనుకుంటున్నాడు శ్రీశాంత్‌. డిఫరెంట్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రీశాంత్‌ బైక్‌ రేసర్‌గా నటిస్తున్నాడు. బైక్‌ రేసింగ్‌ ప్రధానాంశంగా ఈ సినిమా కథా, కథనాలు ఉంటాయి. ఈ సినిమా కోసం శ్రీశాంత్‌ ప్రత్యేకించి బైక్‌ రేసింగ్‌లో శిక్షణ తీసుకున్నాడట.

అంతేకాదు చిన్నప్పట్నుంచీ శ్రీశాంత్‌కి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, యూనివర్సల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ అంటే చాలా ఇష్టమట. వారితో కలిసి స్క్రీన్‌పై చిన్న సీన్‌లో కనిపించే అవకాశం వచ్చినా తానెంతో అదృష్టవంతున్ని అంటున్నాడు శ్రీశాంత్‌. ప్రస్తుతం ఆయనకి విజయ్‌, అజిత్‌ వంటి హీరోలతో కలిసి నటించేందుకు ఆఫర్స్‌ వస్తున్నాయట. స్టార్‌ హీరోల సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్‌ వచ్చినా చేస్తానని శ్రీశాంత్‌ చెప్పడం విశేషం. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular