HomeMovie News Teluguఇట్‌ వాస్‌ జస్ట్‌ ఎ కిస్‌ అంతేనా?

ఇట్‌ వాస్‌ జస్ట్‌ ఎ కిస్‌ అంతేనా?

ముద్దంటే చేదెవరికి? బాలీవుడ్‌ అందాల భామలైతే ముద్దు కోసం పోటీ పడిపోతుంటారు. ఇది ఆన్‌ స్క్రీన్‌ ముద్దు సంగతి. ఒకప్పుడు ఇది పెద్ద తప్పిదంగా భావించేవారు. ఇప్పుడు ముద్దులో ఎన్నెన్ని రకాలున్నాయో, అన్నన్నీ చేసి చూపించేస్తున్నారు. తెరపై ఏం చూపించినా అది తప్పు కాదనే భావన నటీనటుల్లో పెరిగిపోయింది. ‘ఎ జెంటిల్‌మెన్‌’ పేరుతో బాలీవుడ్‌లో రూపొందుతోన్న సినిమా కోసం సిద్దార్ధ మల్హోత్రా, శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ తమలోని రొమాంటిక్‌ యాంగిల్‌ని ఇలా ముద్దుగా చూపించేశారు.

అందుకే ఈ సీన్‌ ఇప్పుడు ఈ సినిమా హాట్‌ న్యూస్‌ అయ్యింది ఎందుకంటే, ఈ సీన్‌లో ముద్దుగుమ్మ జాక్వెలైన్‌, హీరో సిద్దార్ద్‌ మల్హోత్రాలు ముద్దుల పోటీకి బాలీవుడ్‌ శాంతం ఫిదా అయిపోతున్నారట. ఎందుకంటే అంతగా కిందా మీదా పడ్డారట ముద్దుల పోటీలో ఈ ఇద్దరూ. ఆ పోటీలో ఎవరు గెలిచారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ‘ఇట్‌ వాస్‌ జస్ట్‌ కిస్‌’ అంటూ సినిమా ప్రమోషన్‌ని సోషల్‌ మీడియాలో పరుగులు పెట్టించేస్తోంది జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌.

ఈ ప్రమోషన్‌ స్సెషల్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది సినిమా వైపు అందర్నీ. సోషల్‌ మీడియాలో ఆమె పోస్ట్‌ చేసిన ఫొటో చూస్తేనే అర్థమవుతోంది కదా, జస్ట్‌ కిస్‌ కాదు అందులో చాలా అర్థం ఉందని. బాలీవుడ్‌లో హాటెస్ట్‌ లెవల్‌ లిప్‌ కిస్‌ అనే స్థాయిలో ఈ సినిమా కోసం జాక్వెలైన్‌ – సిద్దార్ధ లిప్‌ కిస్‌తో అదరగొట్టేశారట. లెట్స్‌ వెయిట్‌ అండ్‌ వాచ్‌ ఫర్‌ ‘ఇట్‌ వాస్‌ జస్ట్‌ ఎ కిస్‌’. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular