HomeMovie News Teluguబాలయ్య ఈసారి 'జయసింహే'నట

బాలయ్య ఈసారి ‘జయసింహే’నట

‘సింహా’ పేరు బాలకృష్ణకి బాగా కలిసొచ్చిన టైటిల్‌. ‘సింహా’ టైటిల్‌తో తెరకెక్కిన సినిమాలన్నీ సూపర్‌ హిటేక్స అయ్యాయి బాలయ్యకి. అయితే ‘జయసింహ’ పేరుతో ఓ సినిమా చేద్దామని నందమూరి బాలకృష్ణ ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కానీ కుదరలేదు. బాలకృష్ణ తండ్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు ‘జయసింహ’ పేరుతో ఓ సినిమా చేశారు. అలా ఆ టైటిల్‌ మీద బాలకృష్ణకు ఎంతో ఇంట్రెస్ట్‌ ఉండేది. తాజాగా బాలకృష్ణ నటించబోయే సినిమాకి ‘జయసింహ’ పేరుని ఖరారు చేయనున్నారని సమాచారమ్‌.

త్వరలోనే ఈ టైటిల్‌తో సినిమా గురించిన పూర్తి వివరాలు బాలయ్య అధికారికంగా తెలపనున్నారట. ప్రస్తుతం పూరి జగన్నాథ్‌తో ‘పైసావసూల్‌’ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఆ తర్వాత కెఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించే సినిమా షూటింగ్‌కి వెళుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారని ఖరారు చేశారు బాలయ్య. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకి ప్రాధాన్యత అధికంగా ఉండడం వల్ల ఆ పాత్రకి నయనతార అయితేనే బాగుంటుందని బాలయ్య నయన్‌ పేరు సూచించారు.

అందుకు నయన్‌ కూడా ఒప్పుకుందట. ఈ సినిమాలో విలన్‌ పాత్రకి శ్రీకాంత్‌ని అనుకుంటున్నారు. ఈ సినిమాకే ‘జయసింహ’ అనే పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెట్టబోతున్నారట. అయితే ‘జయసింహా’ అంటే పోలీసాఫీసర్‌ పాత్రనో, లేక మామూలు వ్యక్తి పాత్రనో ఇంకా తెలీదు. కానీ బాలయ్య వందో సినిమా తర్వాత పెంచిన జోరు చూసి ఆయన అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular