HomeMovie News Teluguకైరా అద్వానీ అను నేను..

కైరా అద్వానీ అను నేను..

మహేష్‌ సినిమాలో హీరోయిన్‌ ఎవరో తెలిసిపోయింది. మహేష్‌ – కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాకి ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ని పెట్టిన సంగతి తెలిసిందే. ఈ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలోనే బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయ్యింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఇదే తొలి సినిమా. ఈ సినిమా షూటింగ్‌ గత కొన్నిరోజులుగా జరుగుతోంది. మంగళవారం నుంచి ఈ ముద్దుగుమ్మ షూటింగ్‌లో పాల్గొననుందనీ తెలుస్తోంది.

తమిళ నటుడు శరత్‌ కుమార్‌ మహేష్‌కి తండ్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. మహేష్‌ ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారనీ సమాచారమ్‌. అందుకు తగ్గట్లుగానే ‘భరత్‌ అను నేను’ టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు కొరటాల. కొరటాల – మహేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. రీల్‌ పరంగానే కాకుండా, రియల్‌గానూ ఈ సినిమా ఎంతగానో ప్రభావం చూపింది.

అలాగే పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా విషయంలోనూ అదే రేంజ్‌లో అంచనాలున్నాయి. కాగా మహేష్‌ ప్రస్తుతం నటిస్తోన్న ‘స్పైడర్‌’ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాని మురుగదాస్‌ తెరకెక్కిస్తున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular