HomeMovie News Teluguచరణ్‌ కోరిక తీరేదెప్పుడు?

చరణ్‌ కోరిక తీరేదెప్పుడు?

మెగా పవర్‌ స్టార్‌ చరణ్‌ చాలా సార్లు చెప్పారు మణిరత్నం డైరెక్షన్‌లో సినిమా చేయాలని ఉందని. గతంలో ఈ కాంబినేషన్‌లో ప్రాజెక్ట్‌ ఓకే అయ్యింది కూడా. కానీ కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కానీ చరణ్‌కి ఆయనతో సినిమా చేయాలన్న ఆశ మాత్రం వదలట్లేదట. అందుకే మణిరత్నంతో టచ్‌లోనే ఉన్నాడట చరణ్‌. అంతేకాదు అతి త్వరలోనే మణిరత్నంతో చరణ్‌ సినిమా రానుందనీ సమాచారమ్‌. ఈ సినిమాని చరణ్‌ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాలని అనుకుంటున్నారట. ఈ మధ్య మణిరత్నం సినిమాలు అంతగా ఆకట్టుకోవడం లేదు.

ఇటీవలే కార్తి హీరోగా వచ్చిన ‘చెలియా’ ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదు. అయినా కానీ మణిరత్నంతో సినిమా చేయాలని ప్రతీ కథానాయకుడు అనుకుంటాడు. అదే ఆయన డైరెక్షన్‌లోని ప్రత్యేకత. ఆయన డైరెక్షన్‌లో సినిమా చేస్తే నటుడు ఎవరైనా సరే నటనలో రాటు దేలతారనీ ప్రతీ ఒక్కరి నమ్మకం. అందుకే ఆయన సినిమాలకి సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా అంత క్రేజ్‌ ఉంటుంది. ప్రస్తుతం చరణ్‌ – సుకుమార్‌ డైరెక్షన్‌లో ‘రేపల్లె’ సినిమాలో నటిస్తున్నాడు.

ఇదో ప్రయోగాత్మక చిత్రం. పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. సమంత ఈ సినిమాలో చరన్‌కి జోడీగా నటిస్తోంది. మరో పక్క చిరంజీవి 151వ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు చరణ్‌. కొణిదెల ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతోన్న రెండో చిత్రమిది. ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి చరణ్‌ ‘ధృవ’ సినిమాని తెరకెక్కించిన సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగష్టులో ఈ సినిమా పట్టాలెక్కనుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular