HomeMovie News Telugu'బాహుబలి 2' కోసం వెయిటింగ్‌ అక్కడ

‘బాహుబలి 2’ కోసం వెయిటింగ్‌ అక్కడ

‘బాహుబలి’ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. అలాగే బాలీవుడ్‌ ‘దంగల్‌’ కూడా. ఈ రెండు సినిమాలు మన ఇండియన్‌ సినిమా చరిత్రని దేశ దేశాల మాట్లాడుకునేలా చేశాయి. తాజాగా ‘దంగల్‌’ సినిమా చైనాలో విడుదలై చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా చైనాలో చాలా జోరుగా రన్‌ అవుతోంది. ఇప్పటికి 800 కోట్లు వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇంకా సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతుండడం విశేషం. అయితే ‘బాహుబలి ది బిగినింగ్‌’ సినిమాకి చైనాలో అంతగా ఆదరణ దక్కలేదు.

దాంతో ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాని చైనాలో విడుదల చేయాలన్న ఆలోచన రాలేదు రాజమౌళికి. కానీ ఇప్పుడు ‘దంగల్‌’ సాధించిన విజయంతో చైనాలో ఇండియన్‌ సినిమాలకు క్రేజ్‌ పెరిగింది. అక్కడి ప్రేక్షకులకు ఇండియన్‌ సినిమాల పట్ల ఆశక్తి పెరిగింది. తాజాగా చైనాలో కూడా ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమా విడుదల కాబోతోందన్న అనౌన్స్‌మెంట్‌ అక్కడికి చేరింది. దాంతో అక్కడి ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారట.

ప్రపంచం మొత్తం ఈ సినిమా గురించి చర్చించుకుంటుంటే చైనాలో కూడా ఈ సినిమాని చూడాలన్న ఆశక్తి ఎక్కువయ్యిందట. త్వరలోనే చైనాలో ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌ విడుదల కానుంది. ‘దంగల్‌’ సృష్టించిన రికార్డుల్ని ‘బాహుబలి’ బీట్‌ చేస్తుందా? లేక రెండు సినిమాలు అక్కడ కూడా ఇక్కడలాగే పోటీ పడతాయేమో చూద్దాం. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular