HomeMovie News Teluguఏంటి చిరు... ఇది నిజ‌మేనా?

ఏంటి చిరు… ఇది నిజ‌మేనా?

మెగా అభిమానుల దృష్టంతా `ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి`పైనే ఉంది. ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందా?  ఇందులో ఎవ‌రెవ‌రు న‌టిస్తారా?  అంటూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగ‌స్టు 22 చిరంజీవి పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈసినిమా క్లాప్ కొట్టుకొంటుంద‌ని రామ్‌చ‌ర‌ణ్ ఇప్పటికే చెప్పేశాడు. ఈలోపు ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల‌న్నీ ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

అయితే ఈసినిమా వ‌చ్చే యేడాదికి గానీ మొద‌ల‌వ్వ‌ద‌ని, 2019లో విడుద‌ల అవుతుంద‌ని ఓ వాద‌న వినిపిస్తోంది. చిరు 151వ చిత్రం బాలీవుడ్ స్థాయిలో రూపొందుతోంద‌ని, కాస్టింగ్ కోసం టైమ్ ప‌ట్టేలా ఉంద‌ని, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉండడం వ‌ల్ల ఆల‌స్యం అయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దాంతో చిరు అభిమానుల్లో టెన్ష‌న్ మొద‌లైంది.

అయితే… చిత్ర‌బృందం మాత్రం ఈ ఆగ‌స్టుకి ఈ సినిమా మొద‌ల‌వ్వ‌డం ఖాయ‌మ‌ని, 2018 వేస‌వికి విడుద‌ల చేస్తామ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. సో.. చిరు సినిమాపై వ‌స్తున్న‌వ‌న్నీ పుకార్లే అన్న‌మాట‌. వ‌చ్చే వేస‌వికి ఉయ్యాల‌వాడ‌ని తెర‌పైచూసేయొచ్చు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular