HomeMovie News Teluguకమల్‌ ఆ సినిమాని తీసుకురాగలడా?

కమల్‌ ఆ సినిమాని తీసుకురాగలడా?

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ నుండి సినిమా వస్తుందంటే సెన్సేషనే. ఈ సెన్సేషన్‌ అప్పట్లో మరీ ఎక్కువ. అందుకే ఆప్పట్లో ఆయన 100 కోట్లు బడ్జెట్‌తో సినిమా తెరకెక్కించాలనుకున్న అనౌన్స్‌మెంట్‌ రాగానే అదో పెద్ద సంచలనం అయ్యింది. అసలు 100 కోట్లు అంటే అప్పట్లో తెలుగులో ఏంటి, తమిళం, హిందీ, ఇంగ్లీషుల్లో కూడా ఊహించని బడ్జెట్‌. అలాంటిది విశ్వనటుడు కమల్‌ హాసన్‌ ఆ సాహసం చేశారు. అదే ‘మరుదనాయగం’ సినిమా కోసం. ఈ సినిమా అప్పట్లో బ్రిటన్‌ రాణి ఎలిజిబెత్‌ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం అయ్యింది.

ఎవ్వరూ ఊహించని అత్యంత భారీ బడ్జెట్‌ అది. కన్నడ సూపర్‌ స్టార్‌ విష్ణువర్థన్‌, బాలీవుడ్‌ నుండి ఓంపురి వంటి మహా మహా నటులు ఈ సినిమాలో నటించారు. అంత గొప్ప సినిమా ఇది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ప్రేక్షకులూ మర్చిపోయారు. ఈ సినిమాలో నటించిన కాస్టింగ్‌లో కొంతమంది ఇప్పుడు జీవించి కూడా లేరు. అలాంటిది తాజాగా కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో కమల్‌ హాసన్‌ ఈ సినిమా ప్రస్థావన తీసుకొచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేశారు కమల్‌.

కేన్స్‌లో అయితే విడుదల చేశారు కానీ.. సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలరో లేదో తెలీని పరిస్థితి. ఈ సినిమా సంగతి అలా ఉంచితే మరో పక్క కమల్‌ ఎంతో ఎఫర్ట్‌ పెట్టి తీసిన సినిమా ‘విశ్వరూపం 2’. ఈ సినిమా చుట్టూ కూడా అనేక వివాదాలే. అయితే ఈ సినిమానైనా కమల్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో లేదో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular