HomeMovie News Teluguపెళ్ళి చేసి పంపించేస్తారా: రకుల్‌

పెళ్ళి చేసి పంపించేస్తారా: రకుల్‌

టాలీవుడ్‌లో ఇప్పుడు ముద్దుగుమ్మ రకుల్‌ హవా నడుస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో చాలా ట్రెడిషనల్‌ లుక్‌లో ఆకట్టుకుంటోంది. ఫుల్‌ జోష్‌తో కనిపిస్తోంది ఈ సినిమాలో రకుల్‌. ఇలాంటి రకుల్‌ని పెళ్ళి ఎప్పుడు? అని అడిగితే, ‘ఏం, పెళ్ళి చేసి నన్ను సినీ రంగంలోంచి బయటకు పంపించేద్దామనుకుంటున్నారా? హీరోయిన్‌గా సినిమాలు చేయొద్దా?’ అని ప్రశ్నించింది క్యూట్‌ క్యూట్‌గా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాతో రకుల్‌ అంటే భ్రమరాంబ పేరే గుర్తుకొస్తోంది అందరికీ. అంతలా ఆ పాత్ర పేరు ఆమెకి ఫిక్సయిపోయింది. ఈ సినిమాతో రకుల్‌ బాడీ లాంగ్వేజ్‌ కూడా మారిపోయింది. చాలా మెచ్యూర్డ్‌గా కనిపిసోతంది. ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాలో అస్సలు గ్లామర్‌ లేదట. ఆమె ఉద్దేశ్యం గ్లామర్‌ అంటే ఎక్స్‌పోజింగ్‌ అని కావొచ్చు. ‘ధృవ’ సినిమాలో కూడా ఒక్క ‘పరేషానురా’ పాటలో తప్ప ఇంకెక్కడా గ్లామర్‌ లేదంటోంది.

గ్లామర్‌ లేకపోవడమేంటే, గ్లామర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. అలాంటిది ఆమె మాటల్లోని అర్ధంం ఏమనుకోవాలి. ఆమె అనుకునే గ్లామర్‌ వేరు, అసలు గ్లామర్‌ వేరు. గ్లామర్‌ అంటే అందంగా కన్పించడం కదా. మరి రకుల్‌ సైడ్‌ నుండి మీనింగ్‌ ఏంటో కానీ, మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో కెవ్వుకేక పుట్టించేస్తోంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular