HomeMovie News Telugu'దంగల్‌'తో 'బాహుబలి'ని పోల్చొద్దన్న అమీర్‌ఖాన్‌

‘దంగల్‌’తో ‘బాహుబలి’ని పోల్చొద్దన్న అమీర్‌ఖాన్‌

అమీర్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘దంగల్‌’ చిత్రం, ‘బాహుబలి ద కన్‌క్లూజన్‌’ చిత్రాలు రెండూ బాక్సాఫీస్‌ బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచి, ఇండియన్‌ సినిమా ఖ్యాతిని దేశ దేశాల విస్తరించాయి. వసూళ్ల పరంగా పోటా పోటీగా సాగుతున్నాయి. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ ఇప్పటికే 1500 కోట్లు దాటేసింది. ‘దంగల్‌’ చిత్రం చైనాలో విడుదలయ్యాక 1500 కోట్లని టచ్‌ చేసింది. అలా ఈ రెండు సినిమాలు ఇండియన్‌ సినిమా చరిత్రకే ప్రత్యేకమైనవి. అయితే అందరి దృష్టి ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఏది మొదటి స్థానం, ఏది రెండవ స్థానం అనే దాని పైనే ఉంది.

ఇప్పటికైతే ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ తొలి స్థానంలో ఉండగా, ‘దంగల్‌’ ఈ స్థానాన్ని సొంతం చేసుకోవడానికి చేరువలోనే ఉంది. ఇదిలా ఉండగా ‘సచిన్‌ ది బిలియన్‌ డ్రీమ్స్‌’ ప్రత్యేక షోకు ‘దంగల్‌’ హీరో అమీర్‌ ఖాన్‌ హాజరయ్యారు. అక్కడ మీడియా అడిగిన ప్రశ్నకు అమీర్‌ అదిరిపోయే సమాధానమిచ్చారు. ‘దంగల్‌’, ‘బాహుబలి’ని బీట్‌ చేస్తుందా? అని ప్రశ్నించింది మీడియా. ‘బాహుబలి’తో దంగల్‌ని పోల్చొద్దని ఆయన సున్నితంగా సమాధానమిచ్చారు.

‘బాహుబలి’ సినిమాని ఆయన చూడకపోయినా, ఆ సినిమా గొప్పతనం గురించి ఇంతవరకూ చాలానే విన్నారట. ఆ కారణంగా ఆ సినిమా గొప్పతనంతో తన సినిమా ‘దంగల్‌’ని పోల్చవద్దని అంటూ, ఈ రెండు సినిమాలు మన ఇండియన్‌ సినిమా గర్వపడేలా సత్తా చాటాయనీ చెబుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాలు ఇంత ఆదరణ పొందుతున్నందుకు గర్వంగా ఉందనీ అమీర్‌ ఖాన్‌ అన్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular