HomeMovie News Teluguఅభిమానులుంటే అవార్డులతో పనేంటి?

అభిమానులుంటే అవార్డులతో పనేంటి?

సక్సెస్‌ తెచ్చిపెట్టే కాన్ఫిడెన్స్‌ అంతా ఇంతా కాదు. అలాంటి కాన్ఫిడెన్స్‌నే ఇప్పుడు యంగ్‌ హీరో నిఖిల్‌లో చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు టైంలో వచ్చి ఈ చిన్నోడు ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో మంచి విజయం అందుకుని వెళ్లిపోయాడు. ఇప్పుడు.. ఓ పక్క ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ మేనియా ఏ రేంజ్‌లో ఉందో చూస్తున్నాం. ఇలాంటి టైంలోనూ ధైర్యంగా ‘కేశవ’ సినిమాతో వచ్చి మళ్లీ హిట్‌ కొట్టుకెళ్లిపోయాడు. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్‌ రావడమే కాకుండా బోలెడన్ని ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.

నిఖిల్‌ నటన, సినిమా కాన్సెప్ట్‌ అన్నీ చక్కడా కుదిరాయి. దాంతో సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఓవర్సీస్‌లో కూడా జోష్‌గా నడుస్తోంది. తాజాగా సోషల్‌ మీడియాలో ఓ అభిమాని నిఖిల్‌కి సినిమా విజయంపై కంగ్రాట్స్‌ చెబుతూ, ఈ సినిమాలో నిఖిల్‌ నటనకు ఖచ్చితంగా అవార్డు వస్తుంది అని ట్వీట్‌ చేశాడట. ఆ ట్వీట్‌కి నిఖిల్‌ ఆ అభిమానికి థ్యాంక్స్‌ చెబుతూ అభిమానులుంటే అవార్డులెందుకు. అభిమానం ముందు అవార్డు చాలా చిన్నది అని రీ ట్వీట్‌ చేశాడట.

ఇది నిఖిల్‌ మెచ్యూరిటీకి నిదర్శనం. డిఫరెంట్‌ కాన్సెప్ట్స్‌ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ విజయాల బాట పడుతున్న నిఖిల్‌, లవర్‌ బోయ్‌ ఇమేజ్‌ నుండి మరో మెట్టు పైకి ఎక్కాడనిపిస్తోంది. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నాడు. నిఖిల్‌ తదుపరి ‘కార్తికేయ’ సీక్వెల్‌లో నటించబోతున్నాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular