HomeMovie News Teluguఐష్‌ కేన్స్‌ అందాల ప్రదర్శన

ఐష్‌ కేన్స్‌ అందాల ప్రదర్శన

గత పదహారేళ్లుగా కేన్స్‌ చలన చిత్రోత్సవ వేడుకల్లో తళుక్కున మెరుస్తోంది అందాల ఐశ్వర్య. వయసు పైబడినా ఆమెలోని అందం తరగలేదు. మరో పక్క ఈ వయసులో అంతగా అందాల ప్రదర్శన అవసరమా అంటూ నెగిటివ్‌ కామెంట్లు గుప్పిస్తున్నారు అందాల ఐశ్వర్యారాయ్‌ మీద. అందుకు ఐశ్వర్య ఘాటుగా స్పందించింది. ఎక్స్‌పోజింగ్‌ చేయడానికి అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ కేన్స్‌ వేడుక అనేది తారలకు ఓ అద్భుతమైన వేదిక. ఫ్యాషన్‌ ప్రపంచంలో అదో అరుదైన ప్లాట్‌ఫామ్‌. అలాంటి చోట మెరవాలంటే అదృష్టం ఉండాలి.

ఇదివరకటి రోజుల్లో ఆ అదృష్టం అందరికీ దక్కేది కాదు. కానీ ఇప్పుడలా కాదు, మన ఇండియన్‌ తారలకు అక్కడ అరుదైన గౌరవం దక్కుతోంది. ఎక్కువ మందిని ఆహ్వానించేందుకు వారు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు. మన ఫ్యాషన్‌ తళుకులను చూపించే అవకాశం దక్కుతోంది. అంతేకాదు అక్కడ మన ఫ్యాషన్‌ని వారు కూడా ఫాలో చేస్తూండడం గొప్ప విషయం అంటోంది ముద్దుగుమ్మ ఐశ్వర్యారాయ్‌.

అంతేకాదు గ్లామర్‌ వేరు. వల్గారిటీ వేరు. ఆ రెండింటినీ పోల్చి మాట్లాడొద్దు అంటూ ఘాటుగా మాటల తూటాలు పేల్చింది. కేన్స్‌ చలన చిత్రోత్సవంలో ఐశ్వర్యారాయ్‌తో పాటు, మన ఇండియన్‌ భామలు దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా, సోనమ్‌ కపూర్‌, శృతిహాసన్‌ తదితరులు తమ అంద చందాలతో అలరిస్తున్నారు. అక్కడి వేదికకు మన ఫ్యాషన్‌ తళుకులతో అదనపు వన్నెలద్దుతున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular