HomeMovie News Telugu2000 కోట్ల దిశగా 'బాహుబలి' పరుగులు

2000 కోట్ల దిశగా ‘బాహుబలి’ పరుగులు

సాహోరే సాహో బాహుబలి రికార్డులే అహో.. ఏమని చెప్పేది బాహుబలి రికార్డులు. 1000 కోట్లు కాదు 1500 కోట్లు కాదు 2000 కోట్లు కూడా అవలీలగా సాధించేయడానికి సిద్ధంగా ఉంది ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమా. నిన్న కాక మొన్ననే 1500 కోట్లు సాధించిన ఘనత దక్కించుకున్న బాహుబలి ఇప్పుడు అది కూడా బద్దలు కొట్టుకుంటూ 2000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన వీడియో సాంగ్స్‌ని విడుదల చేశారు.

దాంతో ఈ సినిమాని చూడాలన్న ఆశక్తి మరింత పెరుగుతోంది. చూడని వారే కాదు, చూసిన వారు కూడా మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో కానీ, హిందీలో కానీ ఏ ఇతర పెద్ద సినిమాలు లేవు. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ విడుదల తర్వాత ఏ పెద్ద సినిమా విడుదల కాలేదు ఇంతవరకూ. ఇదే ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’కి ఈ రేంజ్‌లో విజయం దక్కడానికి హద్దుల్లేకుండా వసూళు సాధించడానికి అవకాశం అయ్యింది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా సాధిస్తోన్న ఘనతకి ఇండియన్‌ సినిమా గర్వంగా ఫీలవుతోంది. ఇంతవరకూ సీక్వెల్స్‌లో మొదటి సినిమా సాధించిన ఘనత సీక్వెల్స్‌కి అంతగా దక్కింది లేదు. చాలా అరుదుగా సీక్వెల్స్‌ విజయం సాధించాయి. కానీ ‘బాహుబలి ది బిగినింగ్‌’తో కంపేర్‌ చేస్తే ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సాధించిన ఘనత అంతా ఇంతా కాదు. రికార్డు బ్రేకింగ్స్‌ టాక్‌ని సొంతం చేసుకుంటోంది. ఈ రకంగా కూడా ‘బాహుబలి’ది ఓ చరిత్రే అని చెప్పక తప్పదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular