HomeMovie News Teluguచరణ్‌ రాముడైతే, అల్లు అర్జున్‌ ఎవరు?

చరణ్‌ రాముడైతే, అల్లు అర్జున్‌ ఎవరు?

‘రామాయణం’ సినిమాలో ఎవరు నటిస్తారో ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. దాంతో ఊహాగానాలకు ఆకాశమే హద్దు అవుతోంది. ‘రామాయణం’ సినిమాలో రాముడిగా చరణ్‌ నటిస్తాడని గాసిప్‌ రావడమే కాకుండా, రాముడి పాత్రలో చరణ్‌ని ఊహించుకుంటూ కొందరు పోస్టర్స్‌ డిజైన్‌ చేసేస్తూ సోషల్‌ మీడియాలో వాటిని పోస్ట్‌ చేస్తున్నారు. ఇంకో వైపున ఈ సినిమాలో రావణుడిగా రాణా నటిస్తాడనే టాక్‌ వినవస్తోంది. ఈ విషయమై కూడా ఇంకా క్లారిటీ రాలేదు.

అదలా ఉంచితే లేటెస్ట్‌గా ఈ సినిమాలోకి అల్లు అర్జున్‌ పేరుని తీసుకువచ్చారు. అల్లు అర్జున్‌ కూడా ‘రామాయణం’లో నటిస్తాడట. కొన్ని స్టిల్స్‌ కూడా డిజైన్‌ చేసి బన్నీ అభిమానులు సోషల్‌ మీడియాలో వదిలేశారు. దీనంతటికీ కారణం ఈ చిత్రానికి అల్లు అరవింద్‌ నిర్మాత కావడమే. అల్లు అరవింద్‌ నిర్మాణంలో మెగా మూవీగా అత్యంత భారీ బడ్జెట్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే 500 కోట్ల బడ్జెట్‌తో ‘రామాయణం’ చిత్రాన్ని అల్లు అరవింద్‌ మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి నిర్మించాలనుకుంటున్న మాట వాస్తవమే.

కానీ నటీనటుల ఎంపికై ఇంతవరకు ఎలాంటి ప్రయత్నమూ ప్రారంభం కాలేదని విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలియవస్తోంది. ఈ న్యూస్‌ బయటికి వచ్చినప్పటి నుండీ, సోషల్‌ మీడియాలో సందడి అంతకంతకూ రెట్టిపయిపోయింది. ఎవరి ఫ్యాన్స్‌ వారి అభిమాన హీరోలను తమకు నచ్చిన పాత్రల్లో వారిని ఊహించేసుకుని స్టిల్స్‌ డిజైన్‌ చేసేస్తూ తమ క్రియేటివిటీని చాటుకుంటున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular