HomeMovie News Teluguఆమిర్ ఖాన్ కూడా రూ 1000 కోట్లు దాటేశాడు

ఆమిర్ ఖాన్ కూడా రూ 1000 కోట్లు దాటేశాడు

బాలీవుడ్ లో మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ ఇప్పుడు రూ 1000 కోట్ల హీరో అయ్యాడు.

మొన్నటివరకు రూ 1000 కోట్ల మార్కెట్ ని అందుకోలేము అనే భావనలో ఉన్న భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు బాహుబలి 2 రూపంలో ఒక సమాధానం దొరికింది. ఇప్పుడు ఆ సమాధానానికి బలం చేకూర్చేలా ఆమిర్ ఖాన్ దంగల్ చిత్రం నిలిచింది.

పోయినా వారం చైనా దేశంలో విడుదలైన ఈ చిత్రం, వారం రోజుల్లో రూ 300 కోట్లు కొల్లగోట్టడంతో ఈ చిత్రం కూడా బాహుబలి 2 తో పాటుగా రూ 1000కోట్ల మైలురాయిని దాటిన చిత్రంగా నిలిచింది.

2016లో రిలీజ్ అయిన సమయంలో ఈ చిత్రం రూ 700 కోట్లకు పైగా ఆర్జించి సెకండ్ హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ 300కోట్లు వచ్చి చేరడంతో  హిందీ సినిమాల వరకు రూ 1000 కోట్లుసంపాదించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఇవ్వన్ని చూస్తుంటే, 2017 సంవత్సరంభారతీయ చలనచిత్ర పరిశ్రమకి ఒక గుర్తుండిపోయే సంవత్సరంగా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular