HomeMovie News Teluguవర్మ కంపెనీ అద్భుతహ!

వర్మ కంపెనీ అద్భుతహ!

రామ్‌ గోపాల్‌ వర్మ అంటేనే వివాదాలకు కేంద్ర బిందువు. ఆయన ఏం చేసినా అంతే. సినిమా అనౌన్స్‌ చేసినా అంతే, సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టినా, హాట్‌ హాట్‌గా హీటెక్కించేస్తూ ఉంటారు.ే ఆయనికి ముంబయ్‌లో ‘కంపెనీ’ పేరుతో ఓ ఆఫీస్‌ ఉంది. వర్మలానే ఆ ఆఫీస్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఆఫీస్‌ అంటే ఆఫీస్‌ కాదు. సకల సౌకర్యాలు అందులోనే ఉంటాయి. ఆ ఆఫీస్‌లో చాలా రూమ్స్‌ ఉంటాయి. ఒక్కో రూమ్‌కి ఒక్కో పేరు కూడా ఉంటుంది.

ఏం పేర్లంటారా? ఊర్మిళ, నాగార్జున, హిట్లర్‌, మహాత్మాగాంధీ.. ఇలా తదితర అన్ని రకాల పేర్లు ఉంటాయి. అందులోనే ‘హాంటెడ్‌ హౌస్‌’ పేరుతో ఓ రూమ్‌ కూడా ఉంటుంది. హారర్‌ మూవీ షూటింగ్స్‌ అన్నీ ఇక్కడే జరుగుతాయి. హారర్‌ మూవీస్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ అంతా ఈ రూమ్‌లో పొందుపరచబడి ఉంటుంది. తాజాగా ఈ ‘కంపెనీ’ ఇప్పుడు హాట్‌ హాట్‌గా వార్తల్లోకెక్కింది. బాలీవుడ్‌, టాలీవుడ్‌ అంతా ఇప్పుడు వర్మ కంపెనీ గురించే మాట్లాడుకుంటున్నారు.

తాజాగా వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సర్కార్‌ 3’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. గతంలో వచ్చిన ఈ సినిమా ‘సర్కార్‌’ సినిమాకి సీక్వెలే ఈ సినిమా. అమితాబ్‌ బచ్చన్‌ని గాడ్‌ ఫాదర్‌గా చూపించారు వర్మ ఈ సినిమాలో. ఈ సినిమా విజయం దిశగా దూసుకెళ్లిపోతోంది. వర్మ క్రియేటివ్‌ డైరెక్టరే. ఆ క్రియేటివిటీ రేంజ్‌ ఏంటో ఈ సినిమా మరోసారి నిరూపించింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular