HomeMovie News Teluguవెంకీ అడిగితే త్రివిక్రమ్‌ కాదనగలడా?

వెంకీ అడిగితే త్రివిక్రమ్‌ కాదనగలడా?

డైరెక్టర్‌గా త్రివిక్రమ్‌ది ఓ కొత్త రకం పంథా. ఆయన డైలాగ్స్‌లో ఓ ఈజ్‌ ఉంటుంది. చాలా ఈజీగా ఆడియన్స్‌లోకి వెళ్లిపోతాయి ఆయన రాసిన డైలాగులు. అలాగే పవర్‌ ఫుల్‌ పంచ్‌ డైలాగులకి త్రివిక్రమ్‌ పెట్టింది పేరు. ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’ సినిమాలకు త్రివిక్రమ్‌ మాటలు చాలా ఆకట్టుకున్నాయి. కనీ వినీ ఎరుగని రీతిలో ఎంటర్‌టైన్‌ చేశాయి. ఈ మాటల రచయిత త్రివిక్రమ్‌ ఇప్పుడు నెంబర్‌ వన్‌ డైరెక్టర్‌. ప్రస్తుతం త్రివిక్రమ్‌, పవన్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు.

పవన్‌ కళ్యాణ్‌తో త్రివిక్రమ్‌ చేసిన సినిమాలన్నీ సూపర్‌ హిట్సే. తాజాగా త్రివిక్రమ్‌ – వెంకీ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. రీమేక్‌లకి వెంకీ పెట్టింది పేరు. ఇటీవలే ‘సాలా ఖదూస్‌’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘గురు’ సినిమాతో విజయం అందుకున్నాడు. అవును నిజమే వెంకీకి రీమేక్‌లు అచ్చొచ్చాయి కూడా. అందుకే వెంకీ ‘గురు’ తర్వాత మళ్లీ ఓ రీమేక్‌ వైపే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌ హీరోగా తెరకెక్కిన సక్సెస్‌ ఫుల్‌ మూవీ ‘జాలీ ఎల్‌ ఎల్‌ బి 2’ వెంకీ దృష్టికొచ్చింది.

ఈ సినిమా స్టోరీ వెంకీ బాడీలాంగ్వేజ్‌కి కరెక్ట్‌గా సూటయిపోతుంది. అయితే ఆ సినిమాకి మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాలో ఉండాలంటే ఈ సినిమాని తెరకెక్కించే మంచి టాలెంట్‌ ఉన్న డైరెక్టర్‌ ఉండాలంటున్నారు. ఆ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ అయితే ఇంకా బావుంటుందని భావిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే త్రివిక్రమ్‌ – వెంకీ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమా ఇదే కావచ్చునేమో. అయితే ఈ విషయంపై ఇంకా త్రివిక్రమ్‌ గానీ, వెంకీ గానీ నోరు విప్పలేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో!

You May Like This
- Advertisment -spot_img

Most Popular