HomeMovie News Teluguమిల్కీ బ్యూటీ అలా క్లారిటీ ఇచ్చేసింది

మిల్కీ బ్యూటీ అలా క్లారిటీ ఇచ్చేసింది

‘బాహుబలి ది బిగినింగ్‌’ లో అవంతికా రాజకుమారి పాత్రలో కనిపించింది. ‘బాహుబలి’ తొలి పార్ట్‌ అయిన ఈ సినిమాలో పాటల్లో శృంగార దేవతలా అందాలు పండించింది. అలాగే విల్లు పట్టింది, కత్తి యుద్ధాలు కూడా చేసేసింది. ఆ రకంగా మొదటి పార్ట్‌లో మిల్కీ బ్యూటీ తమన్నాది నిడివి ఎక్కువ ఉన్న పాత్రే కానీ, రెండో పార్ట్‌ అయిన ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’లో మాత్రం తమన్నా పాత్ర తక్కువే అంటూ ప్రచారం జరిగింది సినిమా విడుదలకి ముందు.

అయితే ఆ మాటల్ని కొట్టి పారేసింది మిల్కీ బ్యూటీ. రెండో పార్ట్‌లో కూడా తనది ఎక్కువ పాత్రే అని చెప్పుకొచ్చింది. తీరా సినిమా విడుదలయ్యాక తెలిసింది తమన్నా సీను సినిమాలో ఎంతని. క్లైమాక్స్‌ ఫైట్‌లో మెరపులా మెరిసింది అంతే తమన్నా. దాంతో ఆమె అభిమానులు కొంచెం డిజప్పాయింట్‌ అయ్యారు. ఈ డిజప్పాయింట్‌మెంట్‌ ఆ నోటా ఈ నోటా తమన్నా చెవిని చేరగా, సోషల్‌ మీడియాలో ఆమె స్పందించింది. తమన్నా నటించిన సీన్లకు కత్తెరలు ఎక్కువ పడ్డాయని ప్రచారం జరుగుతోంది బయట. అందుకే వాటన్నింటికీ ఆమె సున్నితంగా బదులిచ్చింది.

‘బాహుబలి’ అనేది ఓ మహా యజ్ఞం. ఆ యజ్ఞంలో ఏ చిన్న పాత్ర అయినా అది మొత్తం యజ్ఞం చేసినంత ఫలితాన్నిస్తుంది. అదే సంతృప్తి నాకీ సినిమా ఇచ్చింది. పాత్ర చిన్నదా పెద్దదా అనేది కాదు, ‘బాహుబలి’ వంటి గొప్ప సినిమాలో మనమూ ఓ భాగం కావడం అనే తృప్తి చాలా గొప్పది అని మిల్కీ బ్యూటీ స్వీట్‌గా సెలవిచ్చింది. అంతేకదా మరి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular