HomeMovie News Teluguప్రబాస్‌ కల నెరవేరినట్లేనా?

ప్రబాస్‌ కల నెరవేరినట్లేనా?

‘మిర్చి’ సినిమా టైంలోనే ప్రబాస్‌కి బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలన్న కోరిక మొదలైంది. కానీ అప్పట్లో అది సాధ్యపడే విషయం కాదు అప్పటికి ప్రబాస్‌కున్న స్టార్‌డమ్‌ని బట్టి. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రబాస్‌ ఇప్పుడు యూనివర్సల్‌ స్టార్‌ అయిపోయాడు. ఇదంతా ‘బాహుబలి’ సినిమాతో వచ్చిన గుర్తింపే. ఈ గుర్తింపుతో ప్రబాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడానికి అవకాశాలు సులభతరం అయ్యాయి. బాలీవుడ్‌లో ‘బాహుబలి’ సినిమా ఇప్పటివరకూ ఉన్న హిందీ సినిమాల రికార్డుల్ని కొల్లగొట్టి పారేసింది.

అక్కడా ఇక్కడా కూడా తానే నెంబర్‌ వన్‌ అయ్యి కూర్చుంది. దాంతో ప్రబాస్‌ హీరోగా సినిమా తీస్తే, కాసుల వర్షం కురుస్తుందని అక్కడి దర్శక నిర్మాతలు ఫిక్స్‌ అయ్యారని సమాచారమ్‌. ప్రస్తుతం ప్రబాస్‌కున్న స్టార్‌డమ్‌ని క్యాష్‌ చేసేందుకు ఇమీడియట్‌గా పావులు కదుపుతున్న ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్‌. ఈయన ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాని హిందీలో విడుదల చేశారు. దాంతో కరణ్‌ జోహార్‌ నెక్స్‌ ప్రాజెక్టు ప్రబాస్‌కి అప్పచెప్పే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ విషయంపై ఫుల్‌గా క్లారిటీ రానుంది.

అక్కడి నుండి గ్రీన్‌ సిగ్నల్‌ రావాలే కానీ, ప్రబాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. మరో పక్క ప్రబాస్‌ ‘బాహుబలి’ సినిమాతో ఆయన నెక్స్ట్‌ మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. యంగ్‌ డైరెక్టర్‌ సుజిత్‌తో ప్రబాస్‌ చేస్తున్న సినిమా భారీ బడ్జెట్‌ మూవీగా రూపాంతరం చెందింది. ఇటీవల ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా రిచ్‌ లుక్‌తో హై అండ్‌ యాక్షన్‌ సినిమాగా రూపొందుతోంది ఈ సినిమా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular