HomeMovie News Teluguభళ్ళాలదేవుడు' రియల్‌ హీరో!

భళ్ళాలదేవుడు’ రియల్‌ హీరో!

‘బాహుబలి’లో రానా విలన్‌గా నటించాడుగానీ, రియల్‌ లైఫ్‌లో ‘భళ్లాలదేవుడు’ సూపర్‌ హీరో. శరీరంలో అన్ని అవయవాలూ సక్రమంగా ఉంటేనే, జీవితంలో ఇంకేదో కావాలని పరితపిస్తూ, ఏదో అశాంతితో బతికేస్తుంటారు కొందరు. కానీ రానాలో ఓ శారీరక లోపం ఉంది. అదేమిటంటే, రానాకి ఓ కన్ను పూర్తిగా కనిపించదు. గతంలోనే ఈ విషయం రివీల్‌ అయ్యింది. ఓ టీవీ కార్యక్రమంలో రానా తనలోని లోపాన్ని బయటపెట్టాడు. అయితే ఆ విషయం చాలా తక్కువమందికే రీచ్‌ అయ్యింది.

‘బాహుబలి’ మేనియా దేశాన్ని ఊపేస్తున్న ఈ తరుణంలో ఆనాటి ఆ విషయం మళ్ళీ బయటకు వచ్చింది. రానా ఎంతో ఉద్వేగంగా తనకున్న లోపాన్ని బయటపెడుతున్న వైనం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఆనాటి ఆ వీడియోలోని కొంత భాగాన్ని సోషల్‌ మీడియాలో నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. చిన్నప్పుడే తనకు ఆపరేషన్‌ జరిగిందనీ, ఒక దాత సాయం చేయడం వల్ల తాను ఒక కంటితో అయినా చూడగలుగుతున్నట్లు చెప్పాడు రానా.

ఒక్క కన్నే ఉంది కదా అని నిరాశపడితే నేనేమీ సాధించలేకపోయేవాడిననీ, వైకల్యాన్ని జయించినప్పుడే రియల్‌ హీరో అవుతామని రానా పేర్కొన్న విషయం చాలామంది నిరాశావాదుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. భళ్లాలదేవుడు రానా రియల్‌ హీరో అని చెప్పడానికి ఇంతకన్నా మంచి సందర్భం ఇంకేమొస్తుంది? 

You May Like This
- Advertisment -spot_img

Most Popular