HomeMovie News Teluguదీపిక ఐటమ్‌ టూ మచ్‌ కాస్ట్‌లీ గురూ

దీపిక ఐటమ్‌ టూ మచ్‌ కాస్ట్‌లీ గురూ

‘రబ్‌తా’ సినిమా కోసం బాలీవుడ్‌ భామ దీపికా పడుకొనే ఓ ఐటమ్‌ సాంగ్‌ చేసింది. ఇలాంటివి గతంలో కూడా దీపిక చేసినా, ఈ సినిమా చాలా స్పెషల్‌ అట. ఎందుకంటే హాలీవుడ్‌లో అడుగు పెట్టాక దీపిక చేస్తున్న తొలి ఐటమ్‌ సాంగ్‌ ఇది.  ‘ట్రిపులెక్స్‌’ సినిమాతో ఈ మధ్యే హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనె.

తొలి సినిమాతోనే అక్కడ సెన్సేషనల్‌ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే ఆ సినిమా విడుదలై మంచి విజయం అందుకుంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌, కృతి సనన్‌ జంటగా నటిస్తున్నారు ఈ తాజా చిత్రంలో దీపిక ఐటెం సాంగ్‌లో మెరవడం ఆమె అభిమానలకు పండగలా మారింది. కృతి సనన్‌ తెలుగు ప్రేక్షకులకు ‘1 నేనొక్కడినే’ సినిమాతో సుపరిచితురాలే. ఆమె తెలుగులో నటించిన మరో చిత్రం ‘దోచెయ్‌’. నాగచైతన్య సరసన ఆ సినిమాలో నటించింది కృతి సనన్‌.

‘రబ్‌తా’ సినిమా విషయానికొస్తే, ఇందులో దీపిక చేస్తున్న ఐటమ్‌ సాంగ్‌ కోసం చాలా ఖర్చు చేశారట. భారీ రెమ్యునరేషన్‌ దీపికకే ఇచ్చారని సమాచారమ్‌. రెమ్యునరేషన్‌ ఒక్కటే కాదు, దీపికా పడుకొనేకి ఈ చిత్ర దర్శకుడితో ఉన్న స్నేహం కూడా ఇందులో ఆమె ఐటమ్‌ సాంగ్‌ చేయడానికి కారణమట. ‘రబ్‌తా’ దర్శకుడు దినేష్‌ విజన్‌తో గతంలో దీపిక ‘కాక్‌టెయిల్‌’, ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ చిత్రాలకు పనిచేసింది. ఏది ఏమైనా దీపిక హాలీవుడ్‌ ఎంట్రీ తర్వాత బాలీవుడ్‌లోకి స్పెషల్‌ సాంగ్‌తో స్పెషల్‌ ఎంట్రీ ఇచ్చిందన్న మాట. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular