HomeMovie News Teluguసూపర్‌ స్టార్‌ అల్లుడి 'డైరెక్షన్‌' కథేంటంటే

సూపర్‌ స్టార్‌ అల్లుడి ‘డైరెక్షన్‌’ కథేంటంటే

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడు, తమిళ హీరో ధనుష్‌ దర్శకత్వం వహించిన సినిమా ‘పవర్‌ పాండీ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తమిళనాడులో ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ సినిమా గురించిన చర్చలే జరుగుతున్నాయి. ఈ సినిమాకి సీక్వెల్‌ తీసే ఆలోచనలో ఉన్నాడట ధనుష్‌. ఇదే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. నటన కంటే దర్శకత్వం కష్టమని చెబుతూ, దర్శకుడిగా ఓ సినిమా తీయడానికి ముందు 17 షార్ట్‌ ఫిలింస్‌కి దర్శకత్వం వహించినట్లు వివరించాడు.

ఈ అనుభవం తనకి సినిమా డైరెక్ట్‌ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే ఓ హిందీ సినిమాలో కూడా నటించిన ధనుష్‌, త్వరలోనే హాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. మే 14 నుంచి ఆ హాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుంది. అత్యంత పాపులర్‌ అయిన ఓ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందట. ఈ సినిమాలో నటించడం చాలా గర్వంగానూ, సంతోషంగానూ ఉందంటున్నాడు ధనుష్‌.

ఇంకో వైపు ధనుష్‌, రజనీకాంత్‌ హీరోగా ఓ సినిమా రూపొందించబోతున్నాడట. ‘పవర్‌ పాండి’ సినిమాతో దర్శకుడిగా సత్తా చాటాడు గనుక, మావయ్య రజనీకాంత్‌ హీరోగా ధనుష్‌ రూపొందించే సినిమాపై అంచనాలు అలా ఇలా ఉండవ్‌ మరి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular