HomeMovie News Teluguబ్యాడ్మింటన్‌ స్టార్‌గా ఆ హీరోయిన్‌

బ్యాడ్మింటన్‌ స్టార్‌గా ఆ హీరోయిన్‌

‘బాఘీ’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది శ్రద్ధా కపూర్‌. ఏ సినిమా చేసినా దాన్నొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా భావిస్తుంటుందామె. డెడికేషన్‌తో తన పాత్రకి న్యాయం చేస్తుంది. అందుకోసమే ‘బాఘీ’ సినిమా కోసం ప్రత్యేకంగా మార్షల్‌ ఆర్ట్స్‌ ప్రాక్టీస్‌ చేసింది. ప్రస్తుతం అండర్‌వరల్డ్‌ మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరి పాత్రలో ‘హసీనా’ సినిమాలో నటిస్తోంది. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

సైనా నెహ్వాల్‌ పాత్రలోకి ఒదిగిపోవడం చాలా కష్టమనీ, ఈ పాత్ర కోసం చాలా చాలా కష్టపడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది శ్రద్ధా కపూర్‌. అలాగే బయోపిక్స్‌లో నటించడం అంటే అంత చిన్న విషయమేమీ కాదంటోంది ఈ క్యూట్‌ బ్యూటీ. కమర్షియల్‌ సినిమాల్లో నటించడం కన్నా, బయోపిక్స్‌లో నటిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందంటోంది కూడా. సీనియర్‌ నటి ప్రియాంకా చోప్రా ‘మేరీ కోమ్‌’ అనే సినిమా కోసం బాక్సింగ్‌ నేర్చుకుంది. సినిమా కోసం చాలా బాక్సింగ్‌ దెబ్బలు కూడా తినేసింది.

మరీ అంత సీరియస్‌గా ప్రియాంకా చోప్రాలా కష్టపడాల్సిన అవసరం ఉండదుగానీ, బ్యాడ్మింటన్‌లో కనీస అవగాహన తప్పనిసరి శ్రద్ధా కపూర్‌కి. అందుకే బ్యాడ్మింటన్‌ కోచింగ్‌ తీసుకోవడం స్టార్ట్‌ చేస్తానని చెప్పింది. ఇప్పటికే ఈ పాత్రలో తనని తాను బిల్డప్‌ చేసుకునే విధంగా కసరత్తులు మొదలెట్టేసిందట శ్రద్దా కపూర్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular