HomeMovie News Teluguవర్మగారూ ఏంటిదంతా!

వర్మగారూ ఏంటిదంతా!

రాక్షసుడిగా మారకముందు ఫొటో ఇది అని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో ఓ పొటోని ఉంచి, చేసిన కామెంట్‌ సినీ వర్గాలకు షాక్‌ ఇచ్చిందని చెప్పక తప్పదు. ఇతరుల మీద సెటైర్లు వేసుకోవడమే కాకుండా తన మీద కూడా తానే సెటైర్లు వేసుకోవడం వర్మ స్పెషాలిటీ. తద్వారా ఎవరూ తనని తనకన్నా గొప్పగా విమర్శించలేరని వర్మ నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఇది కూడా అనుకోవాలి.

మానవత్వం ఇంకా బతికున్న మంచి రోజుల్లో నా కూతురితో నేను అని వర్మ ఈ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘గత జన్మలో’ అని మరో కామెంట్‌ పోస్ట్‌ చేయడంద్వారా వర్మ తనలోని క్రియేటివిటీని చాటుకున్నారు. ఏదేమైనా ఇలాంటి విషయాల్లో వర్మకి ఇంకెవరూ సాటి రారు. ఈ మధ్యనే రాజమౌళిని అందగాడిగా పేర్కొంటూ తనను ‘అగ్లీ’గా పేర్కొన్నారు. రాజమౌళితో ఫొటో అనంతరం నాగార్జునతో ఫొటోని కూడా షేర్‌ చేశారు వర్మ. ఏదేమైనా వర్మ పేరే ఓ సంచలనం.

సినిమాల్లో అయినా ట్విట్టర్‌లో అయినా ఆయన సంచలనాలకు ఎదురే లేదు. ఇంకో వైపున వర్మ కొత్త సినిమా ‘సర్కార్‌-3’ విడుదలకు సిద్ధమవుతోంది. అమితాబ్‌బచ్చన్‌తో వర్మ బాలీవుడ్‌లో తెరకెక్కించిన ‘సర్కార్‌’ సిరీస్‌ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన రెండు సినిమాలకు మించి ఈ మూడో సర్కార్‌ ఉండబోతోందనడం నిస్సందేహం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular