HomeMovie News Teluguమెగామూవీ ఆగస్ట్‌లో ప్రారంభమట!

మెగామూవీ ఆగస్ట్‌లో ప్రారంభమట!

చిరంజీవి కొత్త సినిమా సినిమా షూటింగ్‌ ఆగస్ట్‌లో ప్రారంభమవుతుందని మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ చెబుతున్నాడు. తండ్రి మెగాస్టార్‌ కోసం తొలి సారిగా నిర్మాతగా అవతారమెత్తాడు చరణ్‌. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో తన కొత్త సినిమా షూటింగ్‌లో చరణ్‌ బిజీగా ఉన్నాడు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కీలకమైన షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. గోదావరి అందాలు తనను మైమరపింపజేశాయని అన్నాడు రామ్‌చరణ్‌. ఓ వీడియో కూడా విడుదల చేశాడు.

గోదావరిలో పడవ ప్రయాణం చేస్తూ కనిపించాడందులో చరణ్‌. పోలవరం పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌ సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు చరుణ్‌ వద్దకు వచ్చారు. సుకుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదో ప్రయోగాత్మక చిత్రం. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ చాలా కొత్తగా డిఫరెంట్‌గా కనిపించబోతున్నాడు. ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాని సక్సెస్‌ చేసినందుకు నిర్మాతగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు చరణ్‌.

చిరంజీవి కొత్త సినిమా ఎప్పుడు అని అభిమానులు చరణ్‌ని అడగ్గా, ఆగస్ట్‌లో సెట్స్‌ మీదకు వెళుతుందని చెప్పాడు. అదే ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా. సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నారు. చరణే ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular