HomeMovie News Teluguటెన్షన్‌ పెంచేస్తోన్న నాని

టెన్షన్‌ పెంచేస్తోన్న నాని

నాని కొత్త సినిమా ‘నిన్ను కోరి’. ‘నేను లోకల్‌’ సినిమాతో ఇటీవలే నాని మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం నాని కెరీర్‌కి అస్సలు బ్రేకులే లేకుండా పోయాయి. నాని నుండి ఏ సినిమా వచ్చినా అది సూపర్‌ హిట్టే పక్కా.. అనే భావన వచ్చేసింది. ఇక్కడే కాదు నాని పేరు ఓవర్సీస్‌లో కూడా మార్మోగిపోతోంది. అంతలా ఉంది నాని క్రేజ్‌. తాజా సినిమా ‘నిన్ను కోరి’ విషయానికొస్తే, ఈ సినిమా జూన్‌ 23న విడుదల కావాల్సి ఉంది. అదే రోజు అల్లు అర్జున్‌ ‘డీజె – దువ్వాడ జగన్నాధమ్‌’ కూడా విడుదలవుతోంది.

ఈ కారణంగా నాని కొంత వెనక్కి తగ్గాడని రూమర్‌ వినిపిస్తోంది. హిట్‌ మీది హిట్‌ కొడుతున్న నాని వెనక్కి తగ్గే అవకాశమే లేదంటున్నాయి సినీ వర్గాలు. అయితే పెద్ధ హీరో అల్లు అర్జున్‌తో పోటీ ఎందుకులే అని సామరస్యంగానే నాని తన సినిమాని పోస్ట్‌పోన్‌ చేసుకున్నాడంటూ మరో పక్క వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి ఈ డేట్‌ని మొదటగా అనౌన్స్‌ చేసింది నానినే. అయితే మరి ప్రస్తుతం వస్తున్న ఈ రూమర్స్‌లో నిజమెంత? అనేది క్లారిటీ లేదు.

అంతేకాదు నాని వెనక్కి తగ్గడం కాదు కానీ ఒకడుగు ముందుకేసి ఆ డేట్‌ కన్నా ముందే సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాడని టాక్‌ కూడా వినిపిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఫీల్‌ గుడ్‌ రొమాంటిక్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ‘జెంటిల్‌మన్‌’ ఫేం నివేదా థామస్‌ రెండోసారి నానితో జత కడుతోంది. అన్నట్లు జూన్‌ 23న విడుదల కావల్సిన మహేష్‌ బాబు ‘స్పైడర్‌’ కూడా పోస్ట్‌ పోన్‌ అయ్యిందని సమాచారం. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular