HomeMovie News Teluguసమంతతో జర జాగ్రత్త!

సమంతతో జర జాగ్రత్త!

హీరోయిన్‌ సమంత అందాల భామ మాత్రమే కాదు. అంతకు మించి ఆమెలో ఎన్నో స్పెషల్‌ క్వాలిటీస్‌ ఉన్నాయి. ఆమె మనసు వెన్న. అందుకే సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటుంది. అలాగే తెలంగాణ చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయిన తర్వాత చేనేత రంగ సమస్యలపై దృష్టిపెట్టింది. సమంత మనసు చాలా మెత్తన అని అందరికీ తెలుసు. కానీ సమంతలో ఇంకో కొత్త క్వాలిటీ తెరపైకొచ్చింది. అదేమిటో తెలుసా? సమంత ఇకపై యాక్షన్‌ గర్ల్‌ అన్పించుకోబోతోంది. సాక్ష్యం కావాలా? ఈ క్రింది వీడియో చూడండి మీకే తెలుస్తుంది. సమంత కర్రసాము ప్రాక్టీస్‌ చేస్తోంది. తన కొత్త సినిమా కోసమే కావొచ్చుగానీ, సమంత అలా కర్రని ఒడుపుగా తిప్పేస్తోంటే షాక్‌ అవ్వాల్సిందే. కర్రసాముని ఎక్కువగా హీరోలు ఫాలో అవుతుంటారు.

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాలో చరణ్‌ కర్రసాము చేశాడు. ఎందరో హీరోలు కర్రసాము చేసేశారు చాలా సినిమాల్లో. హీరోయిన్ల వరకూ ఇది కొంత అరుదు అని చెప్పక తప్పదు. అందుకే సమంత ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోవాలనుకున్నట్టుంది. అయితే సమంత ఏ సినిమా కోసం ఈ కర్రసాము నేర్చుకుంటోందో తెలియరావడంలేదు. తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్న సమంత తెలుగులో ‘రాజుగారి గది 2’ సినిమాతోపాటుగా, చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలోనూ నటిస్తోంది. ఏదేమైనా సమంతతో కాస్త జాగ్రత్త. ఎందుకంటే ఆమె చేతిలో కర్ర గిరగిరా తిరుగుతుండొచ్చు! 

You May Like This
- Advertisment -spot_img

Most Popular