HomeMovie News Teluguమోహన్‌లాల్‌ అడిగితే వర్మ కాదంటాడా?

మోహన్‌లాల్‌ అడిగితే వర్మ కాదంటాడా?

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మతో సినిమా చేయాలనుకుంటున్నాడు. వర్మ దర్శకత్వంలో నటించాలని ఉందంటూ మోహన్‌లాల్‌ తన మనసులోని కోరిక బయటపెట్టడంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అతి త్వరలో వచ్చేందుకు ఆస్కారముందంటున్నారు సినీ పండితులు. మోహన్‌లాల్‌ మలయాళ సూపర్‌ స్టార్‌ అయినప్పటికీ కూడా ఆయన విలక్షణమైన చిత్రాలు వివిధ భాషల్లో చేశారు.

తెలుగులోనే ఈ మధ్యకాలంలో ఆయన రెండు సినిమాలు చేయడం చూశాం. అలాగే మోహన్‌లాల్‌, దాదాపు 15 ఏళ్ళ క్రిందట వర్మతో పనిచేశారు. అది ‘కంపెనీ’ సినిమా విషయం. ఆ తరువాత మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు. తెలుగులోనూ మార్కెట్‌ పెంచుకున్న మోహన్‌లాల్‌, తెలుగు, హిందీ, మలయాళ, తమిళ సినీ పరిశ్రమల్లో ఓ సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఆ సినిమా కోసమే వర్మతో సంప్రదింపులు జరపాలని అనుకుంటున్నారని సమాచారమ్‌.

ఏదేమైనా మోహన్‌లాల్‌ లాంటి నటుడితో పనిచేయాలని ఏ దర్శకుడైనా అనుకోవడం సహజం. ఎందుకంటే ఎలాంటి భావాన్నయినా పలికించగల గొప్ప నటుడాయన. స్టార్‌డమ్‌ ఉన్నా, అది తనకు ఎప్పుడూ మైనస్‌ కాకుండా చూసుకున్నారు మోహన్‌లాల్‌. అన్నీ కలిసొచ్చి వర్మ, మోహన్‌లాల్‌ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళాలని ఆశిద్దాం. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular