HomeMovie News Teluguఅల్లువారి కుర్రోడు అదరగొట్టేస్తున్నాడు

అల్లువారి కుర్రోడు అదరగొట్టేస్తున్నాడు

అల్లు కాంపౌండ్‌ నుంచి ఇంకా హీరోగా సత్తా చాటడానికి కష్టపడుతూనే ఉన్న అల్లు శిరీష్‌ గ్లామర్‌ పెంచేసే పనిలో నిమగ్నమయ్యాడు. అదొక్కటే కాదు కండలు తిరిగిన శరీరంతో కనిపించబోతున్నాడట కూడా. అన్నయ్యలాగానే సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌ కోసం కసరత్తులు ప్రారంభించాడట. ఇది కూడా అన్నయ్య అల్లు అర్జున్‌ ఇచ్చిన సలహాయేనట. ‘గంగోత్రి’ సినిమాలోని అల్లు అర్జున్‌కీ, ‘సరైనోడు’ సినిమాలో అల్లు అర్జున్‌కీ చాలా తేడా. అతనిలో అంత మార్పు వచ్చింది.

హ్యాండ్సమ్‌ అండ్‌ స్టైలిష్‌ స్టార్‌గా అల్లు అర్జున్‌ తనను తాను మార్చుకున్నాడు. ఇతను హీరో ఏంటి? అని విమర్శల నుంచి స్టైల్‌ ఐకాన్‌ అనే స్థాయికి అల్లు అర్జున్‌ ట్రాన్స్‌ఫామ్‌ అవడం చాలా గొప్ప విషయం. అదంతా దగ్గరుండి చూసిన అల్లు శిరీష్‌ కూడా అదే బాటలో నడుస్తున్నాడట. తొలి సినిమా ‘గౌరవం’ దగ్గర్నుంచి ఇప్పటిదాకా అల్లు శిరీష్‌లో చాలా మార్పులొచ్చాయి. అన్నయ్య బాటలోనే మలయాళ సినిమా పరిశ్రమను ఎట్రాక్ట్‌ చేస్తున్న అల్లు శిరీష్‌, అనతికాలంలోనే స్టార్‌డమ్‌ సంపాదించుకునే అవకాశాలున్నాయ్‌.

ఈ మధ్యకాలంలో అల్లు శిరీష్‌ నుంచి విడుదలువుతున్న స్టిల్స్‌కి మంచి అప్లాజ్‌ వస్తోంది. ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాలతో కమర్షియల్‌ విజయాలు అందుకున్నా, స్టార్‌డమ్‌కి ఇంకా దూరంగా ఉన్న ఈ యంగ్‌ హీరో, అతి త్వరలోనే ఆ లోటు కూడా తీర్చేసుకుంటాడట.

You May Like This
- Advertisment -spot_img

Most Popular