HomeMovie News Teluguఅన్నదమ్ముల కలయిక అతి త్వరలో

అన్నదమ్ముల కలయిక అతి త్వరలో

తమిళ హీరోలు సూర్య, కార్తీ కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు తమ్ముడు కార్తీ. అన్నయ్యతో కలిసి నటించాలని ఉందని చెబుతూ, మంచి కథ కోసం అన్వేషిస్తున్నట్లు వివరించాడు. ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నా సరైన కథ దొరకలేదనీ తన కోరిక త్వరలో నెరవేరుతుందన్న నమ్మకం ఉందని కార్తీ చెప్పాడు. ఇంకో వైపున సూర్య కూడా కార్తీతో కలిసి సినిమా చేయాలన్న అభిలాషను వ్యక్తపరిచాడు.

అభిమానులు తామిద్దరం కలిసి నటించాలని కోరుకుంటున్నారనీ, వారి కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నాడు. సూర్య, కార్తీ ఇద్దరూ తమిళ సినీ రంగంలో స్టార్‌ హీరోలుగా వెలుగుతున్నారు. అలాగే తెలుగు తెరపై కూడా ఇద్దరికీ మంచి స్టార్‌ డమ్‌ ఉంది. తెలుగులో నటించాలని సూర్యకి ఉన్నా, అతనికి తెలుగులో ఇంతవరకు సరైన కథ దొరకలేదట. కథలకు లోటేముంది? సినిమా చెయ్యడానికి బహుశా టైమ్‌ లేదేమో.

కార్తీ మాత్రం ‘ఊపిరి’ సినిమా చేసేశాడు. సూర్య కంటే స్పష్టంగా తెలుగులో మాట్లాడగలడు కార్తీ. చూడ్డానికి కార్తీ తమిళ హీరోలా ఉండడు, అసలు హీరోలాగానే ఉండడు. మన పక్కింటి కుర్రాడే అన్నట్లుగా ఉంటాడతడు. అందుకే కార్తీ, సూర్యకంటే వెనక వచ్చినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అన్నయ్యకంటే ఫాలోయింగ్‌ ఎక్కువ పెంచుకున్నాడు. ఏదేమైనప్పటికీ ఈ ఇద్దరూ వెండి తెరపై ఒకే సినిమాలో నటిస్తే అభిమానులకు ఆ కిక్కే వేరప్పా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular