HomeMovie News Teluguసుకుమారికి ఎంత కష్టమొచ్చిందో

సుకుమారికి ఎంత కష్టమొచ్చిందో

అందాల భామలు బక్క పలచగా కనిపించడం ఓ ట్రెండ్‌. దాన్నే జీరో సైజ్‌ అంటున్నారు. ఆ జీరో సైజ్‌ మోజులో పడి, అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు కొందరు. ఆ కోవలో దీపికా పడుకొనే కూడా కచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కాదు. గతంలో జీరో సైజ్‌ కోసం ట్రై చేసి సమస్యలెదుర్కొంది దీపికా పడుకొనే. ఇప్పుడు కొంచెం వాటంగానే తయారయ్యింది. అయినప్పటికీ నాజూకుదనంలో దీపికా పడుకొనేతో ఎవరూ పోటీ పడలేరేమో.

అయితే ఆ అతి నాజూకుదనం దీపికా పడుకొనేకి ‘పద్మావతి’ సినిమా షూటింగ్‌లో సమస్యలు తెచ్చిపెడుతోంది. బరువైన కాస్ట్యూమ్స్‌తో దీపిక ఎదుర్కొంటున్న సమస్యలు చూసి చిత్ర యూనిట్‌ ఆశ్చర్యపోతోంది. తాజాగా ఓ బరువైన బంగారు ఆభరణం దీపికా పడుకొనే మెడలో సినిమా కోసం వేస్తే, ఆ బరువుకి మెడ మీద గాయమయ్యిందట. గాయం చిన్నదే అయినా, ఆ గాయం వల్ల మచ్చలు ఏర్పడితే ఏంటి పరిస్థితి? అని ఆందోళన చెందుతోంది దీపికా పడుకొనే.

సమస్య తాను సన్నబడ్డం వల్ల వచ్చింది కాదని, నగల తయారీలో స్మూత్‌నెస్‌ లేకపోవడమే పెద్ద సమస్య అని ఆమె ఆరోపిస్తోంది. అయితే అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు చిత్ర యూనిట్‌ సమాధానమిస్తోంది. హాలీవుడ్‌ మోజులో పడిపోయి, శరీరాన్ని ఇంకా సెన్సిటివ్‌గా మార్చేసుకుందని విమర్శలు వస్తుండగా, వాటిని ఖండిస్తూ హాలీవుడ్‌కి వెళ్ళాక తన శరీరం ఇంకా రఫ్‌గా, టఫ్‌గా తయారైందని ఆమె వెల్లడించింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular