HomeMovie News Teluguజూ.పవర్‌స్టార్‌ కాదు, అఖిరానందన్‌!

జూ.పవర్‌స్టార్‌ కాదు, అఖిరానందన్‌!

పవర్‌ స్టార్‌ తనయుడు..జూనియర్‌ పవర్‌ స్టార్‌ అఖీరానందన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా రేణూ దేశాయ్‌ తనయుడు అఖీరానందన్‌కి బర్త్‌డే విషెస్‌ చెబుతూ.. పుత్రోత్సాహం తెలుపుతూ ఓ మెసేజ్‌ పెట్టింది. అఖీరానందన్‌ జూనియర్‌ పవర్‌ స్టార్‌ అనే గుర్తింపునే కాకుండా, అఖీరానందన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని రేణూ దేశాయ్‌ తెలిపింది.

ఇప్పుడు అఖీరానందన్‌కి 13 ఏళ్లు. పవన్‌ కళ్యాణ్‌, రేణూ దేశాయ్‌ ప్రేమకి గుర్తు అఖీరానందన్‌. అఖీరానందన్‌కి పవన్‌ కళ్యాణ్‌ కొడుకు అన్నదాని కన్నా మంచి గుర్తింపు ఏముంటుంది. ఆ మాటకొస్తే పవన్‌ కళ్యాణ్‌కి చిరంజీవి తమ్ముడు అన్న దాని కన్నా గొప్ప గుర్తింపు మరోటి ఉండదు కదా. కానీ పవన్‌ కళ్యాణ్‌కి చిరంజీవి తమ్ముడు అన్న దాన్ని మించిన గుర్తింపు పవర్‌ స్టార్‌ అని అభిమానులు పిలుచుకుంటారు.

అలాగే ఆయన పుత్ర రత్నం అఖీరానందన్‌ కూడా జూనియర్‌ పవర్‌ స్టార్‌ అనే గుర్తింపును మించిన మరింత మంచి గుర్తింపు తెచ్చుకుని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తల్లి రేణూదేశాయ్‌తో పాటు మనం కూడా ఆకాంక్షిద్దాం. మరో పక్క మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియా ద్వారా అఖీరానందన్‌కి బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. పలువురు సినీ ప్రముఖులు పవన్‌కళ్యాణ్‌ తనయుడు అఖిరానందన్‌కి బర్త్‌ డే విషెస్‌ని సోషల్‌ మీడియా ద్వారా అందిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular