HomeMovie News Teluguమెగాస్టార్‌తో విక్టరీ వెంకటేష్‌ మిస్సయ్యాడు

మెగాస్టార్‌తో విక్టరీ వెంకటేష్‌ మిస్సయ్యాడు

చిరంజీవితో డాన్స్‌ చేసే ఛాన్స్‌ మిస్సయ్యాడట విక్టరీ వెంకటేష్‌. ఆ విషయం వెంకటేష్‌ చెప్పేదాకా చిరంజీవికి కూడా తెలియదు. ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా కోసం చిరంజీవితో కలిసి డాన్స్‌ చేయాలని వెంకటేష్‌తోపాటుగా బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ కూడా అనుకున్నారట. ఈ విషయం చరణ్‌కి చెప్పారట కూడా. అయితే అనుకోకుండా తన కాలికి గాయం కావడం వల్ల ఆ ఛాన్స్‌ మిస్సయ్యిదని వెంకటేష్‌ చెప్పేసరికి చిరంజీవి కూడా ఆశ్చర్యపోయారు.

వెంకటేష్‌, చిరంజీవికి మంచి స్నేహితుడు. వెంకటేష్‌ తండ్రి, మూవీ మొఘల్‌ రామానాయుడు – చిరంజీవిని ‘రాజా’ అని అప్యాయంగా పిలిచేవారు. ఆ పిలుపుకి చిరంజీవి ఎంతో మురిసిపోయేవారు. ఇంకో వైపున చరణ్‌ – సల్మాన్‌ఖాన్‌ మధ్య స్నేహం ఉంది. సల్మాన్‌ఖాన్‌, చిరంజీవికి మంచి స్నేహితుడు. అన్నీ అనుకున్నట్లుగా జరిగినట్లయితే ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాలో చిరంజీవి, వెంకటేష్‌, సల్మాన్‌ఖాన్‌ స్టెప్పులేసేవారే అన్నమాట.

అద్భుతమైన ఛాన్స్‌ మిస్‌ అయిపోయాం కదా! ఆ సినిమాకి మిస్‌ అయినా భవిష్యత్తులో చిరంజీవి, వెంకటేష్‌ కలిసి సినిమాల్లో నటించే అవకాశాలున్నాయి. పవన్‌కళ్యాణ్‌తో వెంకటేష్‌ ఇప్పటికే ‘గోపాల గోపాల’ సినిమాలో నటించి ఉన్నాడు. వెంకీ వెరీ వెరీ స్పెషల్‌ అనేది అందుకే. అందరివాడు, అందరితోనూ కలిసిపోగలడు. దటీజ్‌ విక్టరీ వెంకటేష్‌. తన తాజా చిత్రం ‘గురు’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడీ విలక్షణ హీరో. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular