HomeMovie News Teluguఅభిమానులూ ఓపిక పట్టండి: మహేష్‌

అభిమానులూ ఓపిక పట్టండి: మహేష్‌

మురుగదాస్‌ – మహేష్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోందన్న సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకూ ఈ సినిమాకి సంబంధించిన ఒక్క లుక్‌ కూడా బయటికి రాలేదు. అప్పుడెప్పుడో సోషల్‌ మీడియాలో ఓ లుక్‌ వచ్చింది కానీ, అది సినిమాకి సంబంధించిందో లేదో అంతగా తెలీదు. కానీ ఫ్యాన్స్‌ అదే మహేష్‌ కొత్త లుక్‌ అనుకుని సరిపెట్టుకున్నారంతే. తన కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ కోసం అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో మహేష్‌కి తెలుసు.

కానీ టైటిల్‌ విషయంలో సస్పెన్స్‌ కారణంగా మహేష్‌ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల ఆలస్యమవుతోంది. ఉగాదికి ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని ఎలాగైనా విడుదల చేస్తారని అనుకున్నారు అభిమానులు. కానీ ఉగాదికి వస్తుందనుకున్న లుక్‌ కూడా ఆలస్యమవడంతో అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్టుంది. ఆ ఒత్తిడిని గుర్తించిన మహేష్‌, సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. కొంచెం ఓపిక పట్టమని కోరాడు.

సినిమా కోసం యూనిట్‌ సభ్యులమంతా రాత్రీపగలు కష్టపడుతున్నట్లు చెప్పాడు మహేష్‌. తమ అభిమాన హీరో ఇంతలా విజ్ఞప్తి చేశాక అభిమానులు శాంతించకుండా ఉంటారా? ఎదురుచూపుల్లో తీవ్రత తగ్గదుగానీ, త్వరలో వస్తుందని మహేష్‌ చెప్పిన మాటతో కొంత ఊరట చెందుతారు. మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో మహేష్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular