HomeMovie News Teluguబన్నీతో అర్జున్‌ - అదిరిపోయే కాంబినేషన్‌!

బన్నీతో అర్జున్‌ – అదిరిపోయే కాంబినేషన్‌!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించనున్న ఓ సినిమా కోసం ప్రముఖ తమిళ నటుడు అర్జున్‌ని సంప్రదించారని సమాచారమ్‌. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. రచయితగా పలు విజయవంతమైన చిత్రాలకు పనిచేసిన వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు. సీనియర్‌ నటుడు అర్జున్‌, పలు తెలుగు సినిమాల్లో నటించాడు హీరోగా. యాక్షన్‌ హీరోగా తెలుగులో అర్జున్‌కి మంచి ఫాలోయింగ్‌ ఉంది.

నితిన్‌ హీరోగా వచ్చిన ‘శ్రీఆంజనేయం’, రామ్‌ హీరోగా వచ్చిన ‘రామరామ కృష్ణకృష్ణ’ తదితర సినిమాల్లో కీలక పాత్ర పోషించాడు అర్జున్‌. విలక్షణ పాత్రలకు కూడా అర్జున్‌ కరెక్ట్‌గా సూటయిపోతాడు. తాజాగా అల్లు అర్జున్‌ హీరోగా రానున్న సినిమాలో అర్జున్‌ నటించడం ఖాయమైతే ఇది సెన్సేషన్‌ కాంబినేషన్‌ అనిపించుకుంటుందనడం నిస్సందేహం. అర్జున్‌ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ, అది బహుశా విలన్‌ పాత్ర కావొచ్చంటూ ప్రచారం గట్టిగా జరుగుతోంది.

ఏప్రిల్‌లో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘దువ్వాడ జగన్నాధమ్‌’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ ప్రస్తుతం యూ ట్యూబ్‌లో సెన్సేషన్స్‌ సృష్టించింది. ముద్దుగుమ్మ పూజా హెగ్దే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లు అర్జున్‌ బ్రాహ్మణ యువకుడిగా సరికొత్త గెటప్‌లో కనిపిస్తున్న చిత్రమిది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular