HomeMovie News Teluguకేటీఆర్‌కి న‌చ్చిన కాట‌మ‌రాయుడు

కేటీఆర్‌కి న‌చ్చిన కాట‌మ‌రాయుడు

ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా చిత్రం కాట‌మ‌రాయుడికి ఊహించ‌ని ప్ర‌శంస ల‌భించింది. కేటీఆర్ ఈ సినిమా చూశారు.. చూడ్డ‌మే కాదు, సినిమా బాగుంద‌ని ట్విట్ట‌ర్‌లో మెచ్చుకొన్నారు. “ప‌వ‌న్, శ‌ర‌త్ మ‌రార్ మీరు నిజ‌మైన విజేత‌లు. చేనేత రంగాన్ని ప్రోత్స‌హించినందుకు అభినందిస్తున్నా“ అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు కేటీఆర్‌. ప‌వ‌న్‌తో తీయించుకొన్న ఫొటో కూడా ట్వీట్ చేశాడు. ఆదివారం కేటీఆర్ కోసం ప్ర‌త్యేకంగా ఓ షో వేసింది చిత్ర‌బృందం. ఆ సంద‌ర్భంలో ప‌వ‌న్‌తో కేటీఆర్ కాసేపు భేటీ అయ్యార‌ని స‌మాచారం.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చేనేత రంగానికి ప‌వ‌న్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇటు తెలంగాణ‌లో కూడా కేటీఆర్ చేనేత రంగాన్ని ప్రోత్స‌హిస్తున్నారు. అందులో భాగంగా స‌మంత‌ని బ్రాండ్ అంబాసిడ‌ర్‌ని చేశారు. కాట‌మ‌రాయుడులో ప‌వ‌న్ చేనేత రంగాన్ని ప్రోత్స‌హించాల‌న్న ఉద్దేశంతో నేత వ‌స్త్రాల‌తో క‌నిపించాడు. అందుకే కేటీఆర్‌కి ఈసినిమా అంత బాగా న‌చ్చిందేమో.!

You May Like This
- Advertisment -spot_img

Most Popular