టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘KING100’. రా. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొనగా.. తాజాగా హీరోయిన్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఐశ్వర్య రాజేష్‌ను హీరోయిన్గా చిత్ర బృందం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన ‘KING100’ గ్లింప్స్‌ను ఐశ్వర్య రాజేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.
దీంతో ఆమె ఈ సినిమాలో భాగమై ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరి నిజంగానే ఐశ్వర్య రాజేష్ ‘KING100’ లో నాగార్జునకు జోడీగా కనిపించనున్నారా? లేక ఈ ప్రచారంలో నిజం లేదా? అనేది మేకర్స్ అధికారిక ప్రకటన చేస్తేనే స్పష్టత రానుంది.





