ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి, లేడీ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్‌కు సంబంధించిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. వేములవాడలోని ఓ హోటల్లో వీరిద్దరూ ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య అక్కడికి చేరుకుంది. అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను ఆమె వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనపై ఈశ్వర్ సాయి భార్య స్పందిస్తూ, తన భర్త తప్పేమీ లేదని, మాధురి రాథోడ్ వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నట్లు సమాచారం. తన భర్త మంచివాడని, అతడిని మాధురి ప్రభావితం చేస్తోందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘నీ భర్త చిన్న పిల్లాడా? తెలియకుండానే హోటల్‌కు వెళ్లాడా?’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ ఘటన ఫోక్ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి చేసిన ఫోక్ సాంగ్స్ కూడా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో’ పాట నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వైరల్ వీడియోలో కనిపించిన ఘటనకు ఈ పాటలోని కొన్ని సన్నివేశాలు, లిరిక్స్‌ను లింక్ చేస్తూ నెటిజన్లు మీమ్స్, రీల్స్ చేస్తున్నారు. దీంతో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఎక్కడ చూసినా ఈ పాటకు సంబంధించిన పోస్టులు, వీడియోలు కనిపిస్తున్నాయి.
ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి గతంలో పలు ఫోక్ సాంగ్స్‌లో నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన పాటలకు ఇప్పటికే మంచి క్రేజ్ ఉండగా, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఘటన కారణంగా వాటికి మరోసారి భారీగా ప్రచారం లభిస్తోంది. ముఖ్యంగా ‘రాతిరి రాతిరి రాతిరిలో జాము జాము రాతిరిలో’ పాటకు ఇప్పటికే మిలియన్ల వ్యూస్ ఉండగా, తాజా పరిణామాలతో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.





