HomeMovie News Teluguమా ఇంటి బంగారం తో సమంత సరికొత్త రికార్డు..

మా ఇంటి బంగారం తో సమంత సరికొత్త రికార్డు..

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని భారీ వసూళ్లతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసింది.

తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు తెలుగులో విడుదలైన ఫిమేల్ లీడ్ చిత్రాల్లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాగా మా ఇంటి బంగారం నిలిచిందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ రికార్డుతో సమంత కెరీర్‌లో మరో మైలురాయి చేరినట్లైంది. ఇప్పటివరకు ఏ తెలుగు లేడీ ఓరియెంటెడ్ చిత్రం నమోదు చేయని స్థాయిలో ఈ సినిమా వసూళ్లు సాధించిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కూడా ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular