HomeMovie News Teluguమోనాలిసా పెళ్లిలో ట్విస్ట్.. భర్తపై పోక్సో కేసు నమోదు!

మోనాలిసా పెళ్లిలో ట్విస్ట్.. భర్తపై పోక్సో కేసు నమోదు!

గత ఏడాది కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయిన మోనాలిసా పేరు ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది. ఓవర్‌నైట్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆమె, ఇటీవల తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

కేరళలోని పూవార్‌లో ఒక ఆలయంలో జరిగిన ఈ పెళ్లి మొదటి నుంచే వివాదాలకు కేంద్రబిందువైంది. లవ్ జిహాద్ అంటూ దర్శకుడు సనోజ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు, దానికి ప్రతిగా మోనాలిసా చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి.

ఇప్పటికే వివాదాలు చల్లారుతున్నాయనుకునే సమయంలో ఈ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) విచారణలో పెళ్లి సమయంలో మోనాలిసా మైనర్ అని తేలినట్లు సమాచారం.

దీంతో ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో (POCSO) కేసు నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఒక సాధారణ పూసల అమ్మాయి నుంచి సోషల్ మీడియా స్టార్‌గా ఎదగడం, ప్రేమ వివాహం, వరుస వివాదాలు, ఇప్పుడు పోక్సో కేసు.. ఇలా మోనాలిసా జీవితం ఊహించని మలుపులు తీసుకుంటోంది.

ఇక ఈ కేసుపై నిజాలు ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. మోనాలిసా నిజంగా మైనరా? లేక ఇది మరో వివాదమేనా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.

మొత్తానికి, కుంభమేళాలో వెలుగులోకి వచ్చిన ఈ పూసల సుందరి కథ ఇప్పుడు పోలీస్ కేసుల దాకా చేరడం హాట్ టాపిక్‌గా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular