HomeMovie News Teluguడెకాయిట్ ట్రైలర్ అదిరింది..!

డెకాయిట్ ట్రైలర్ అదిరింది..!

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం డెకాయిట్. షానిల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్తవానికి ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మేకర్స్ ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యారు.

ఈ నేపథ్యంలో విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ట్రైలర్ ప్రారంభంలో హరి (అడివి శేష్), జూలియట్ (మృణాల్ ఠాకూర్)ల మధ్య ఉన్న అందమైన ప్రేమకథను చూపించారు. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకునే ఈ జంట, పెళ్లి తర్వాత తమ జీవితాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తారు.

అయితే కథ సవ్యంగా సాగుతున్న సమయంలో అనుకోని ట్విస్ట్ వస్తుంది. కొన్ని పరిస్థితుల కారణంగా హరి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అసలు హరి ఎందుకు జైలుకు వెళ్లాడు? ఆ సమయంలో జూలియట్ పరిస్థితి ఏంటి? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హరి తనపై జరిగిన అన్యాయానికి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనే అంశాలను ట్రైలర్‌లో సస్పెన్స్‌గా, ఇంటెన్స్‌గా చూపించారు.

ట్రైలర్‌లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ మధ్య కెమిస్ట్రీ ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. మరోవైపు హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా రేంజ్‌ను పెంచాయి.

దర్శకుడు షానిల్ డియో రొమాన్స్, రివెంజ్ డ్రామాను సమతుల్యంగా మిళితం చేసినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి డెకాయిట్ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular