చిత్రం: రాకాస
దర్శకత్వం: మానస శర్మ
కథ – రచన: మానస శర్మ
నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి తదితరులు
నిర్మాతలు: నిహారిక కొణిదెల, ఉమేశ్ కుమార్ బన్సల్
సంగీతం: అనుదీప్ దేవ్
సినిమాటోగ్రఫీ: రాజు ఎడురోలు
ఎడిటర్: అన్వర్ అలీ
బ్యానర్: పింక్ ఎలిఫెంట్ బ్యానర్
విడుదల తేదీ: 03 ఏప్రిల్ 2026
ఐక్లిక్ న్యూస్ రేటింగ్: 2.75/5
మెగా డాటర్ నిహారిక మొదట హీరోయిన్ గా వెండి తెరపై గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు నిర్మాతగా మారారు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నిహారికా రెండో ప్రయత్నంగా నిర్మించిన సినిమా రాకాస. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కారణం మ్యాడ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ హీరో కావటంతో మ్యాడ్ టైప్ హెల్దీ కామిడీ ఎక్సపెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. పైగా రాకాస ట్రైలర్, టీజర్ మరిన్ని అంచనాలను పెంచాయి. ప్రమోషన్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు మేకర్స్. ఈ వారం థియేటర్స్ లో సందడి చేస్తున్న హారర్ కామెడీ కాన్సెప్ట్ ‘రాకాస’ ఎలా ఉందొ ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
వీరబాబు అలియాస్ వీరూ (సంగీత్ శోభన్) అమెరికాలో ఉద్యోగం చేస్తుంటాడు. తాను ప్రేమించిన తన చిన్ననాటి స్నేహితురాలు సుబ్బలక్ష్మి (నయన్ సారిక)ను పెళ్లి చేసుకోవటానికి సొంత ఊరికి వస్తాడు. వీరూ వచ్చేసరికి సుబ్బలక్ష్మి వేరే వ్యక్తితో పెళ్లికి రెడీ అయిపోతుంది. ఈ క్రమంలో పెళ్లి ఆపటానికి వీరూ రక రకాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆ ప్రయత్నాలే వీరుని చిక్కు ల్లో పడేస్తాయి. ఆ ఊరి పొలిమేరలో ఒక పెద్ద కోట ఉంటుంది. ఆ కోటలో చాలా ఏళ్లుగా ఒక రాక్షుసుడు ఉంటాడు. అనుకోని కారణాల వలన వీరు ఆ రాక్షసుడికి బలిగా వెళ్లాల్సి వస్తుంది. ఈ నేపథ్యం లో వీరూ ఎదుర్కొన్న సంఘటనలేంటి ? కోటలో నిజంగానే రాక్షసుడున్నాడా? అసలు ఆ రాక్షుడు కథ యేంటి? చివరికి వీరూ ఆ రాక్షుసుని బారినుండి తప్పించుకున్నాడా? లేదా? సుబ్బలక్ష్మి, వీరు కథ సుఖాంతం అయ్యిందా లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
తెలుగులో ఇప్పటికే హారర్ కామెడీ సినిమాలు చాలా వచ్చాయి. వీటిలో కొన్ని ప్రేక్షులని మెప్పించాయి. కొన్ని ఎప్పుడు వచ్చాయో కూడా తెలియకుండా పోయాయి. ఇప్పుడు వచ్చిన రాకాస కూడా హారర్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చింది. కానీ ఫాంటసీ మూవీలా మెప్పించింది. హారర్ సినిమాలు అనగానే దెయ్యాలు కథలు చెప్తారు. కానీ దర్శకురాలు మానస శర్మ కొత్తగా బ్రహ్మ రాక్షుసుడు కాన్సప్ట్ తీసుకుని పిల్లల్ని, పిల్లలతో పాటు పెద్దవాళ్ళని ధియేటర్ కి రప్పించేలా రాకాస కథని మలిచారు. పాత జనరేషన్ చందమామ, బాలమిత్ర, భేతాళ కథల్లో ఎక్కువగా రాక్షసులు, బ్రహ్మ రాక్షసుల గురించి ఎన్నో కథలు విన్నాం. కానీ ఇప్పుడు జనరేషన్ కి హారర్ అంటే కేవలం ఆత్మలు , ప్రేతాత్మ కథలు. ఈ జనరేషన్ కి కూడా చందమామ కథని చెప్పినట్టు ఉంది రాకాస. జెన్ z కి రాక్షుసుడి కథని పరిచయం చేసి మరిన్ని కొత్త ఫాంటసీ కథలకి తెరతీశారు మానస శర్మ.
ప్రేమించిన అమ్మాయి కోసం వచ్చిన అమెరికా నుంచి వచ్చిన వీరబాబు అనుకోకుండా కోటలో ఉన్న బ్రహ్మ రాక్షుసుడికి బలిగా వెళ్ళటం రాక్షుసుడి బారి నుంచి ఆ ఊరిని ఎలా రక్షించాడన్నది కథ. ఒక చిన్న కాన్సెప్ట్ ని దర్శకురాలు చక్కగా స్క్రీన్ పై ప్రజంట్ చేసిన విధానం బాగుంది. కోటలో ఉన్న బ్రహ్మ రాక్షసుడున్ని చూసి ఊరంతా భయపడటం, సిగ్నల్ వచ్చినప్పుడు జంతువులతో పాటు ఒక మనిషిని కూడా బలి ఇవ్వడం లాంటి అంశాలు పిల్లలకి కొత్తగా ఉంటాయి. ఫస్టాఫ్ స్లో గా ఉన్నా సెకండ్ హాఫ్ లో హీరో కోటలోకి ఎంటర్ అయినదగ్గరనుంచి ప్రేక్షకుడిని పొట్టచెక్కలయ్యేలా నవ్వించారు. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సంగీత్ శోభన్ తమ కామెడీ టైమింగ్ తో కథకి బలం చేకూర్చి ప్రేక్షకుల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. బ్రహ్మ రాక్షసుడు లాంటి భారీ విగ్రహం ముందు వీరు చేసే కామెడీ కడుపుబ్బా నవ్వించింది. క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. రాకాస’లో నవ్వులకైతే లోటు లేదు. సంగీత్ శోభన్, వెన్నెల కిషోర్, గెటప్ శీను కనిపించిన ప్రతిసారీ నాన్ స్టాప్ పంచులతో నవ్వించారు. కోట లోపల ఈ ముగ్గురూ కలిసి చేసిన అల్లరి సినిమాకు ప్రధాన బలం. ఫస్ట్ హాఫ్ ఊరిలో జరిగే కొన్ని విషయాలు కొంత ఉత్కంఠ రేకెత్తిస్తాయి. ఊరి శాపం గురించి మరింత డిటైల్డ్ గా చెప్పి ఉంటె బాగుండేది. ఈ కారణంతోనే కథ బలహీన పడిపోయింది. ఐతే ప్రతి సీన్ ని హాస్యరస ప్రధానంగా మలిచిన తీరు బాగుంది. రాక్షసుడి ఎమోషనల్ యాంగిల్ సినిమాకి ఇంకొక ప్లస్. ఈ సీన్ సినిమాలో బాగా హైలెట్ అయ్యింది. కథ మొత్తం ఇలా చెప్పగలిగి ఉంటె ‘రాకాస’ స్థాయి వేరేలా ఉండేది. కేవలం కామెడీ పై ద్రుష్టి పెట్టి మిగతా విషయాలకి పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. మొత్తానికి వేసవి సెలవుల్లో పిల్లలని థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం సఫలం చేసాడు రాకాస.
నటీ నటులు:
మ్యాడ్ సిరీస్ లతో భారీ హట్ కొట్టిన సంగీత్ శోభన్ ఇప్పుడు రాకాస తో మరో హిట్ కొట్టి, కామెడీ హీరోగా నిలదొక్కుకున్నాడు. సంగీత్ సినిమా అంటే కేరాఫ్ కామెడీ అన్న ముద్ర వేసుకున్నాడు. సంగీత్ కామెడీ టైమింగ్ తో ప్రతి సీన్ లో ప్రేక్షుకులం మెప్పించాడు. అల్లరి నరేష్ ని గుర్తు చేసాడు సంగీత్. మొత్తానికి సంగీత్ శోభన్ ఉంటె నవ్వులు పూయటం ఖాయం అని నిరూపించాడు. హీరోయిన్ నయన్ సారిక కూడా తన నటనతో ఆకట్టుకుంది. కథలో కీ రోల్ ఆమెది కావటం విశేషం. సారిక పాత్రకు న్యాయం చేస్తూ చక్కటి నటనతో మెప్పించింది. వెన్నెల కిషోర్, గెటప్ శీను కామెడీ టైమింగ్ అదిరింది. తనికెళ్ళ భరణి, ఆశిష్ విద్యార్థి, అన్నపూర్ణ, తదితరులు తమ తమ పాత్రలు పరిధి మేరకు నటించారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా చూస్తే ‘రాకాస’ చిన్న సినిమాలా లేదు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఒక చిన్న సినిమాని ఈ స్థాయిలో నిర్మించినందుకు నిర్మాతగా నిహారిక అభిరుచుని మెచ్చుకోవాల్సిందే. సెట్స్, వీఎఫెక్స్ పై బాగా శ్రద్ద పెట్టారు. అనుదీప్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. రాక్షసుడి ఎంట్రీ సీన్స్, హారర్ సీన్స్, రాక్షుసుడి కి సంభందించిన ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలం అని చెప్పొచ్చు. రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ బాగుంది. మానస శర్మ మొదటి సినిమా అయినా ప్రేక్షుకులకి ఫుల్ కామెడీ కిక్కిచ్చి మెప్పించారు. మానస టేకింగ్ ట్రెండీగా ఉంది.
ప్లస్ పాయింట్స్
నటీ నటులు
కామెడీ , ఫాంటసీ అంశాలు
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
కథ, కథనంలో కొత్తదనం లేకపోవటం
ఫైనల్ వర్దిక్ట్ : అందమైన చందమామ కథ ‘రాకాస’





