HomeMovie News Teluguపెద్ది రిలీజ్ డేట్.. క్షమాపణలు చెప్పిన ఎస్కేఎన్

పెద్ది రిలీజ్ డేట్.. క్షమాపణలు చెప్పిన ఎస్కేఎన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది విడుదల తేదీపై తాజాగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఒక చిన్న గందరగోళం నెలకొంది.

చెన్నై లవ్ స్టోరీ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత ఎస్కేఎన్ స్టేజీపైనే జూన్ 25న పెద్ది విడుదల అవుతుందని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. అయితే, చిత్ర యూనిట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకముందే ఈ డేట్ బయటకు రావడం వివాదానికి దారితీసింది.

ఈ నేపథ్యంలో వెంటనే స్పందించిన ఎస్కేఎన్ ఓ వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. ఈవెంట్‌లో హడావుడి, జనాల శబ్దం వల్ల ఒక చిన్న మిస్ కమ్యూనికేషన్ జరిగింది. డైరెక్టర్ సాయి రాజేష్ ముందే పెద్ది రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించే వరకు ఎలాంటి సమాచారం చెప్పొద్దని చెప్పారు. కానీ నేను ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, ఇప్పటికే డేట్ ప్రకటించారేమో అనుకుని స్టేజీపై చెప్పేశాను అని వివరించారు.

అలాగే, వేదిక దిగాకే అసలు విషయం తెలిసింది. ఇంకా మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించలేదని అర్థమైంది. నా మాట వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించండి. నా ఉద్దేశం ఎప్పుడూ తప్పుగా కాదు. పెద్ద సినిమాతో క్లాష్ కాకుండా మా సినిమా రావాలని మాత్రమే అనుకున్నాను అని అన్నారు.

ఎస్కేఎన్ వివరణ ఇచ్చినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై ఇంకా చర్చ కొనసాగుతోంది. కొందరు నెటిజన్లు ఆయన మాట మార్చడం వెనుక మరేదైనా కారణం ఉందేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, పెద్ది అధికారిక రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular