HomeMovie News Teluguబైకర్ సెన్సార్ రిపోర్ట్..

బైకర్ సెన్సార్ రిపోర్ట్..

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం బైకర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసింది.

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెన్సార్ అనంతరం సినిమా నిడివిని కూడా ఫైనల్ చేశారు. మొత్తం 2 గంటల 42 నిమిషాలు 30 సెకండ్ల రన్‌టైమ్ తో బైకర్ ప్రేక్షకులను అలరించనుంది.

ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించగా, లూజర్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు రాజశేఖర్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.

యువి క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్న బైకర్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular