HomeMovie News Teluguగ్రాండ్‌గా నారా రోహిత్ వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

గ్రాండ్‌గా నారా రోహిత్ వివాహం.. హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

నారా కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. యంగ్ హీరో నారా రోహిత్ (Nara Rohit) తన ప్రేయసి శిరీష (Shirisha)ను వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “నారా రోహిత్ పెళ్లి అంటే మా ఇంటి పండుగే. కుటుంబ సభ్యులందరం ఎంతో సంతోషంగా ఈ వేడుకలో పాల్గొన్నాం” అని పేర్కొన్నారు. పెళ్లికి విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

నారా రోహిత్, శిరీషల ప్రేమకథ కూడా ఆసక్తికరంగానే సాగింది. ‘ప్రతినిధి-2’ (Prathinidhi 2) సినిమాలో శిరీష హీరోయిన్‌గా నటించిన సమయంలో వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

శిరీష స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని రెంటచింతల. ఆమె కుటుంబంలో నాలుగో సంతానంగా జన్మించి, ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు పూర్తి చేశారు. అక్కడ కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు. సినిమాలపై ఆసక్తితో ఇండియాకు వచ్చి ‘ప్రతినిధి 2’ చిత్రంలో నటించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular